ట్యాంక్ బండ్ పై ఫన్ డే బంద్…

ఓమిక్రాన్ ఎఫెక్ట్..

R9TELUGUNEWS.COM..

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం ప్రస్తుతం హైదరాబాద్ పై పడింది. ఈ ఓమిక్రాన్ వేరియంట్ చాలా వేగం గా వ్యాప్తి చెందడం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.ఎక్కువ మొత్తం లో ప్రజలు గుమిగూడే ప్రదేశాల లో వైరస్ ఎక్కువ గా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటం తో పలు ఆంక్షలు విధించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ సన్నదం అవుతుంది…అయితే ఓమిక్రాన్ వేరియంట్ తో ప్రమాదం ఉందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతుంది. ప్రజలను ఇప్పటి కే అప్రమత్తం చేసింది. తాజా గా మరో నిర్ణయం కూడా తీసుకుంది. ప్రతి ఆది వారం హైదరాబాద్ లో ని ట్యాంక్ బాండ్ ప్రాంతం లో నిర్వహించే సండే ఫన్ డే ను వచ్చే ఆది వారం అంటే ఈ నెల 5న రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. అలాగే ప్రజలు ఎక్కువ గా గుమిగూడ కుండా ఉండాలని తెలిపారు. ఓమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరమైందని.. దీని పట్ల జాగ్రత్త గా ఉండాలని సూచించారు…