నీళ్లు అనుకొని నాటు సారా తాగిన ఏనుగులు….!

ఒడిశాలో ఏనుగులు మద్యాన్ని తాగి గాఢ నిద్రలోకి వెళ్లిన ఘటన వెలుగుచూసింది..
కియోంజర్‌ జిల్లా పరిధిలోని అడవిలోకి స్థానిక గ్రామస్థులు వెళ్లారు…
అక్కడ దొరికే కొన్ని పూలు, పండ్లతో నాటు సారాను తయారు చేయడానికి ప్రయత్నించారు. తొలుత వాటిని నానబెట్టి ఇంటికి వచ్చారు…మరుసటి రోజు మంగళవారం తిరిగి అడవిలోకి వెళ్లారు. అయితే నానబెట్టి ఉన్న కుండలు పగిలిపోయి ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతదూరం వెళ్లి చూస్తే 24 ఏనుగులు గాఢ నిద్రలో ఉన్నాయి. కుండల్లోని నానబెట్టిన నీటిని ఏనుగులు తాగాయని నిర్ధరించుకున్న గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాళ్లు వచ్చి భారీ శబ్ధం చేయడంతో ఏనుగులు లేచి వెళ్లిపోయాయి.