కాశ్మీర్ ఫైల్స్ మూవీపై ప్రకాష్ రాజ్ కామెంట్స్.చిత్రం గాయాలను నయం చేస్తుందా ? రేపుతోందా? లేదా ద్వేషం విత్తనాలను నాటుతుందా?..

ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఏ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుందో తెలిసిందే. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ చిత్రం చూసి ఫిదా అయ్యారు..తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంపై స్పందిస్తూ తన ట్విట్ ఖాతాలో ఓ వీడియో వదిలారు. అందులో ఓ థియేటర్‌లో వ్యక్తి ఓ వర్గంపై విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నాడు.
https://twitter.com/prakashraaj/status/1504679927647731714?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1504679927647731714%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fthe-kashmir-files-a-propaganda-film-says-prakash-raj%2F
కాశ్మీర్ ఫైల్స్ మూవీపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన “ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రధాన మంత్రి మోడీ నుంచి సామాన్యుల దాకా సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో సౌత్ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేరిపోయాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా “ది కాశ్మీర్ ఫైల్స్”పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాశ్మీర్ ఫైల్స్… ఈ ప్రచార చిత్రం గాయాలను నయం చేస్తుందా ? రేపుతోందా? లేదా ద్వేషం విత్తనాలను నాటుతుందా?” అని ప్రశ్నిస్తూ ఎప్పటిలాగే తనదైన శైలిలో #జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక కాశ్మీరీ పండిట్‌లపై 1990లో జరిగిన అఘాయిత్యాల అంశం ఆధారంగా తెరకెక్కి, మార్చి 11న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు.