ది కాశ్మీర్ ఫైల్స్’తో పాటు చిత్ర బృందాన్ని మోదీ ప్రశంసించారు.

గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంటున్న `ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సినిమాను చూసిన ఆయన చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు గు నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను అభినందించారు..
అనుపమ్ ఖేర్ ప్రధాన నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా ప్రజలకే కాదు, ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బాగా నచ్చింది. దీంతో ఆయన స్వయంగా ఈ సినిమా బృందాన్ని రప్పించుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు…టాలీవుడ్ లో కిరాక్ పార్టీ, గూఢచారి, సీత, ఏ1 ఎక్స్ ప్రెస్, రాజరాజ చోర నిర్మించి ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాను నిర్మిస్తున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన తాజా చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. ప్రస్తుతం ఎక్కడ చూసినా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ గురించే చర్చ జరుగుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కాశ్మీరీ పండిట్ల బాధను కళ్ళకు కట్టినట్టు చూపింది.

ప్రధాని సైతం మెచ్చిన సినిమా..
ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించడం మొదలుపెట్టగా అనేక మంది నుంచి సినిమా మీద ప్రశంశల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా సినిమాను ప్రశంసించారు. ఇటీవల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్, నటి పల్లవి జోషి ప్రధాని మోదీని కలిశారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’తో పాటు చిత్ర బృందాన్ని మోదీ ప్రశంసించారు.