కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్..

కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్..

గత కొన్ని రోజులగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని, బీసిలకు రేవంత్ మరియు కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేసిన మల్లన్న తిరిగి అదే కాంగ్రెస్ గూటికి చేరాడు.

ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్… ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ (congress party) తీర్థం పుచ్చుకున్నారు తీన్మార్ మల్లన్న.

కాంగ్రెస్ నేతలు కండువా కప్పి… తీన్మార్ మల్లన్నను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. కాగా… తీన్మార్ మల్లన్న మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల సపోర్టు తనకు ఇవ్వాలని మొదట్లో కోరారు తీన్మార్ మల్లన్న. కానీ ఏ పార్టీ కూడా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయలేదని సమాచారం. ఇక ఇప్పుడు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) కాంగ్రెస్ పార్టీలో చేరారు.