తిరుమలలో మరోసారి చిరుత పులి హల్‌చల్..

తిరుమలలో మరోసారి చిరుత పులి హల్‌చల్..

‘బాలుడిపై దాడి’ ఘటన మరువక ముందే…

తిరుమల.. అలిపిరి బాటలో ఓ చిన్నారిపై చిరుత దాడిని మరువక ముందే మరోసారి వాటి సంచారం భక్తులకు భయాందోళనలు కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద బుధవారం సాయంత్రం అటుగా వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించింది. అయితే వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు జీఎన్‌సీ వద్ద వాహనదారులను గుంపుగా పంపిస్తున్నారు. అలాగే ఆ చిరుతను దారి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కాగా, ఇటీవలి కర్నూల్ జిల్లాకు చెందిన దంపతులు తమ 4 ఏళ్ల కుమారుడు కౌశిక్‌తో కలిసి అలిపిరి నుంచి తిరుమలకు వెళుతున్న క్రమంలో.. బాలుడిపై చిరుత దాడి చేసింది. ఆ చిన్నారి తలను నోటకరుచుకని వెళ్తుండగా.. అప్రమత్తమైన తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే కేకలు వేయడంతో అది భయాందోళనకు గురై, చిన్నారిని విడిచివెళ్లింది. అయితే బాలుడు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.