అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ గెలువడంలో తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష కీలక పాత్ర…

మొట్టమొదటి మహిళల U19- T20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు సాధించిన అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగిడి త్రిషారెడ్డికి అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ గెలువడంలో తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించిందని సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్‌ చాంపియన్‌గా అవతరించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ చారిత్రక విజయంలో తెలంగాణ ప్రతిభ కూడా ఉండటం గర్వకారణమని ఒక ప్రకటనలో తెలిపారు. త్రిష భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఆదివారం జరిగిన ఫైనల్లో త్రిష భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.