తుమ్మల అనుచరుల రహస్య సమావేశం..

ఖమ్మం సత్యనారాయణపురంలోని టిసివి రెడ్డి ఫంక్షన్ హాల్లో తుమ్మల అనుచరుల రహస్య సమావేశం..

పాలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల, పాలేరు స్థానాన్ని సిట్టింగ్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డికి కేటాయించడంతో భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై అనుచరుల సమాలోచనలు.

నియోజవర్గ స్థాయిలోని ప్రధాన అనుచరుల సమావేశం. అనుచరుల భేటీలో కీలక నిర్ణయాలు. పాలేరులో పోటీ చేయాల్సిందేనని నిర్ణయం.పాలేరు టికెట్‌ను సీఎం కేసీఆర్‌ సిట్టింగ్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డికి కేటాయించారు. దీంతో భవిష్యత్తు కార్యచరణపై తుమ్మల నాగేశ్వరరావు ము‌ఖ్య అనుచరులు సమావేశమయ్యారు. పాలేరులో తుమ్మల పోటీ చేయాల్సిందేనని ఈ సమావేశంలో అనుచరుల నిర్ణయం తీసుకున్నారు.

జిల్లాలోని తుమ్మల అభిమానులందరం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటన. వెంటనే రాజకీయ నిర్ణయం తీసుకోవాలని కొరతామని ప్రకటన.

పాలేరు అడ్డా తుమ్మల గడ్డ అంటూ నినాదాలు..