నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష…

రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాల ఏర్పాటు
3.80 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ఆదివారం నిర్వహిస్తున్నారు.
టెట్‌ రాసేందుకు 3,80,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్‌-1 కోసం 1,480 కేంద్రాలను, 1,203 కేంద్రాలను పేపర్‌-2 కోసం సిద్ధం చేశారు. పేపర్‌-1ను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్‌-2ను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. టెట్‌ అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనుంది….

ఉమ్మడి నల్గొండ జిల్లాలో
టెట్ పరీక్ష కు సర్వం సిద్ధం…

నల్గొండ, యాదాద్రి ,సూర్యపేట జిల్లాల్లో
353 కేంద్రాల ఏర్పాటు….హాజరుకానున్న 83,439 అభ్యర్థులు ….