ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ తాత్కాలికంగా ఆగిపోయింది….

R9TELUGUNEWS.COM. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ తాత్కాలికంగా ఆగిపోయింది. భార్యాభర్తల విభాగం కింద వచ్చిన అప్పీళ్లను పరిష్కరించే వరకు కౌన్సెలింగ్‌ను ఆపాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన మంగళవారం మధ్యాహ్నం డీఈవోలతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించినట్లు తెలిసింది. కొత్త జిల్లాలకు కేటాయింపు, సీనియారిటీ, భార్యాభర్తల కేటగిరీలకు సంబంధించి దాదాపు 5 వేల అభ్యంతరాలు(అప్పీల్‌) అందాయి. అంతర్‌ జిల్లాల భార్యాభర్తలకు సంబంధించిన అభ్యంతరాలను పరిశీలించి… వారికి పోస్టింగులు ఇచ్చిన తర్వాత కౌన్సెలింగ్‌ మళ్లీ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. మరోవైపు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మంగళవారం సాయంత్రం కమిషనరేట్‌కు వచ్చి అధికారులతో సమీక్షించారు. బుధవారం ఉదయానికి మొత్తం అప్పీళ్లను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో కమిషనరేట్‌లో 20 బృందాలను నియమించి అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. సుల్తానియా అంతకుముందు ఇంటర్‌ విద్య కమిషనరేట్‌కు వెళ్లి సమీక్ష జరిపారు. అక్కడ మొత్తం 36 అప్పీళ్లు అందగా అందులో మూడు మాత్రమే సరైనవి ఉన్నట్లు అధికారులు చెప్పారని సమాచారం…