సరదాగా పులితో ఆటలు.. ప్రాణం తీసిన పులి..

మెక్సికోలోని జూలో పులి దాడిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ వీడియో పాతది.. అయితే మళ్ళీ సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో, పులి ఎన్‌క్లోజర్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్లు మీరు . అయితే అతను పులి బోనులో చేయి పెట్టి.. చేసే పని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొదట పులిని తన వైపుకు పిలవడానికి ప్రయత్నించాడు. అది దగ్గరకు వచ్చిన తర్వాత తన చేతితో పులి మెడను సవారు తీయడం మొదలు పెట్టాడు. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పులి హఠాత్తుగా కోపంతో స్పందించింది. బోనులోపల ఉన్న మనిషి చేతిని పట్టుకుని తినడం ప్రారంభించింది. పులి నోటికి తన చేయి చిక్కడంతో ఆ మనిషి నొప్పితో పెద్దగా అరవడం ప్రారంభించినా పులి అతడిని వదల లేదు..

పులి దాడికి సంబంధించిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో savage.wilderness అనే ఖాతాతో భాగస్వామ్యం చేయబడింది. కొన్ని గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను 9 వేల మందికి పైగా లైక్ చేసినప్పటికీ, ఈ క్లిప్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.