టైగర్ నాగేశ్వరరావు’ రివ్యూ..!!

టైగర్ నాగేశ్వరరావు

నటీనటులు : రవితేజ, Ravi teja, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, అనుక్రీతి వాస్ తదితరులు

డైరెక్టర్ : వంశీ కృష్ణ

నిర్మాత : అభిషేక్ అగర్వాల్

మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్

విడుదల తేదీ : 20 అక్టోబర్ 2023.

ఒక వ్యక్తి స్టోరీ. ఇంతకీ ఆ వ్యక్తి ఏమైనా సెలబ్రిటీనా? స్వాతంత్ర సమరయోధుడా? లేక రాజకీయ నాయకుడా? లేక ఆటగాడా? సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా అంటే అస్సలు కాదు.. అతడు ఒక దొంగ. అవును.. ఓ దొంగ బయోపిక్ అని చెప్పుకోవచ్చు. ఒక దొంగ జీవితాన్ని ఆధారంగా చేసుకొని టైగర్ నాగేశ్వరరావు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆ దొంగగా మాస్ మహారాజా రవితేజ నటించారు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. స్టూవర్టుపురం అనే పేరు మీరు వినే ఉంటారు కదా. ఇప్పుడు కాదు కానీ.. 1970 వ దశకంలో స్టూవర్టుపురంలో టైగర్ నాగేశ్వర రావు అనే వ్యక్తి పెద్ద గజదొంగ. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

పాన్ ఇండియా మూవీగా టైగర్ నాగేశ్వరరావు మూవీ తెరకెక్కింది. రవితేజ Ravi Teja తొలి పాన్ ఇండియా మూవీ Pan India Movie అని చెప్పుకోవచ్చు. దసరా dussehra కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూను వేశారు..విదేశాల్లో కూడా ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. దీంతో ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో రివ్యూలు కూడా వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. ఇక రవితేజ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అసలు సినిమా ఎలా ఉందో.. రవితేజ నటన ఎలా ఉందో చెబుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుక్రీతి వాస్ నటించారు. వీళ్లంతా కొత్త నటీమణులే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ renu desai కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఆమె దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు..

నటీనటుల పనితీరు: ఫ్యాన్స్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా “రాజా ది గ్రేట్” విడుదలైన తర్వాత రవితేజ ఎలాంటి లుక్ ఇచ్చినా అంధుడిలానే కనిపిస్తున్నాడు. కానీ “టైగర్ నాగేశ్వర్రావు”లో ఆ లుక్ నుంచి బయటపడ్డాడు. ముఖ్యంగా ప్రతి సినిమాలో గెటప్ విషయంలో దాదాపు ఒకేలా కనిపించే రవితేజ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. అలాగే.. నటుడిగానూ తనలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మంచి ఎమోషన్స్ పండించాడు రవితేజ.

హీరోయిన్స్ గా కనిపించిన నుపుర్ సనన్ & గాయత్రి భరద్వాజ్ లకు పెద్దగా స్క్రీన్ టైమ్ లేదు. అయితే.. నుపుర్ నటిగా అలరించలేకపోయింది కానీ.. గాయత్రి భరద్వాజ్ మాత్రం ఆకట్టుకుంది. అనుపమ్ ఖేర్ & నాజర్ మరోమారు తన సీనియారిటీ ప్రూవ్ చేసుకునారు. ఆడుకాలం నరేన్ & హరీష్ లు సినిమాకి మంచి హైలైట్స్ గా నిలిచారు. రేణు దేశాయ్, మురళీశర్మ, జీషు సేన్ గుప్తా, సుదేవ్ నాయర్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

కథ:

సాధారణంగా బయోపిక్స్ అంటే అప్పటి జీవితాలను ఇప్పటి తరానికి ప్రేరణగా ఉండటం కోసం రూపొందిస్తూంటారు. అలా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, వల్లభాయ్ పటేల్‌ వంటి బయోపిక్ లతో పాటు సినీ నటులైన ఎన్టీఆర్,జయలలిత, సావిత్రి ల బయోపిక్స్, అలాగే ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ బయోపిక్స్‌ను తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, హజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్ వంటి కరుడు కట్టిన నేరస్తుల జీవితాలను ప్రేరణగా తీసుకుని వారిని హీరోలుగా చూపిస్తూ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు ఒకప్పటి స్టూవర్ట్‌పురం బందిపోటు దొంగ జీవితాన్ని తెరకెక్కించారు. గతంలో స్టూవర్ట్‌పురం దొంగల జీవితాలను బేస్ చేసుకుని చిరంజీవి హీరోగా స్టూవర్ట్‌పురం పోలీస్ ‌స్టేషన్‌ సినిమా వచ్చింది. అలాగే భానుచందర్ హీరోగా స్టూవర్ట్‌పురం దొంగలు అనే పేరుతో మరో సినిమా కూడా తెరకెక్కింది. అయితే ప్రత్యేకంగా ఓ దొంగ జీవితాన్ని బేస్ చేసుకుని మాత్రం ఏ సినిమా తెరకెక్కలేదు. ఈ సినిమా వచ్చింది.

దొంగతనాలకు ప్రసిద్ధి చెందిన స్టువర్టుపురంలో ఎనిమిదేళ్ల వయసులోనే ఒక దొంగతనం చేసే క్రమంలో తండ్రినే చంపిన నాగేశ్వరరావు.. యుక్త వయసు వచ్చేసరికి గజదొంగగా మారతాడు. భారీ దొంగతనాలతో తమకు సవాలుగా మారిన నాగేశ్వరరావును పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించవు. చివరికి ఒక భారీ దొంగతనం కేసులో పోలీసులు అతణ్ని మద్రాస్ జైల్లో పెడితే.. అక్కడ్నుంచి కూడా తప్పించుకుంటాడు. టైగర్ నాగేశ్వరరావు గురించి ఒక దశలో ప్రధానమంత్రి భద్రతాధికారి సైతం కంగారు పడే పరిస్థితి వస్తుంది. అతను నాగేశ్వరరావు గురించి తెలుసుకోవడానికి స్టువర్టుపురం వస్తాడు. అక్కడ నాగేశ్వరరావులో తెలియని కోణాలన్నీ బయటపడతాయి. ఆ కోణాలేంటి.. అసలు నాగేశ్వరరావు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు.. దోచుకున్న డబ్బంతా ఏం చేస్తున్నాడు.. చివరికి నాగేశ్వరావు ప్రయాణం ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ….

వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువ. థియేటర్లో కూర్చున్న తర్వాత తెరపై కనిపిస్తుంది వాస్తవమా? కల్పితమా? అనే విషయం కంటే కథ ఆసక్తిని కలిగించిందా? లేదా? అనేదే ముఖ్యం. ఒక దశ వరకు పర్వాలేదనిపించిన సినిమా తర్వాత గాడి తప్పింది. ఎక్కడా భావోద్వేగాలు పండలేదు. నాగేశ్వరరావు దొంగతనాలను థ్రిల్ కలిగించేలా తీశారా? అంటే అలా కూడా తీయలేకపోయారు. ఓ దొంగ ప్రధానమంత్రి సీటు వరకు వెళ్లాడన్నప్పుడు అతనిలో ఎంత ధైర్యం, ఎన్నో తెలివితేటలు ఉండాలి. అయితే వాటిని ఎక్కడా చూపించలేకపోయారు. అదే సినిమాకు ప్రధాన బలహీనతగా మారింది.
ఫస్టాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత స్లో డౌన్ అయ్యి తిరిగి ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపు అందుకున్న సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా ఆసక్తి కరమైన సీన్స్ తో అలాగే కొన్ని చోట్ల కొంచం లెంత్ వలన డ్రాగ్ అయినట్లు అనిపించింది అంటున్నారు… రియల్ స్టోరీ కి కొన్ని ఫీక్చనల్ సీన్స్ ను యాడ్ చేసి తీసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా లెంత్ పరంగా మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది అంటున్నారు, అలాగే కోర్ పాయింట్ ఆసక్తిగా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే కొంచం కన్ఫ్యూజింగ్ గా అలాగే కొంచం సాగదీసినట్లు అనిపించింది..