తీన్మార్ మల్లన్న భార్యకు డిప్యూటేషన్ పై నాగోలుకు బదిలీ..

కాంగ్రెస్‌ పార్టీ నేత చింతపండు నవీన్‌కుమార్‌ తీన్మార్‌ మల్లన్న భార్య కొండాపురం మాతమ్మకు ప్రభుత్వం గ్రేటర్‌లోని ఓ స్కూల్లో ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని కల్పించింది.

మాతమ్మ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూళ్లో పీఈటీగా పనిచేస్తున్నారు.

ఆమెను మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా నాగోలు జెడ్పీ హైస్కూల్‌లో ఏడాది పాటు ఆన్‌డ్యూటీ ఓడీ, సౌకర్యం కల్పిస్తూ యాదాద్రి-భువనగిరి జిల్లా డీఈవో నారాయణరెడ్డి శనివారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చారు.

మల్లన్న కూతురు వైకల్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఆమెకు ఓడీ సౌకర్యం కల్పించినట్టు తెలిసింది.

ఇదే తరహాలో మరికొందరికి సైతం ప్రభుత్వం ఓడీ సౌకర్యాన్ని కల్పించింది. మరోచోట ఎస్పీ భార్యతో పాటు, భార్యకు పక్షవాతం, భర్తకు ధీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారినీ ప్రభుత్వం బదిలీచేసింది.