తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు..

సోమాజిగూడ ప్రెస్ క్లబ్

*🔹తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) సంచలన
వ్యాఖ్యలు*

రేవంత్ రెడ్డి నన్ను సస్పెండ్ చేయాలని ఒకటే ప్రయత్నం చేసిండు

షోకాజ్ నోటీసులకు భయపడే పిరికి రక్తం మల్లన్నది కాదు

నన్ను సస్పెండ్ చేసి రేవంత్ రెడ్డి తప్పు చేసిండు

మన్మోహన్ గవర్నర్ మెంట్ లో రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ ను తగలబెట్టిండు

నేను కులగణన తప్పు అన్ని ప్రతులను తగలబెట్టిన

కులగణన పై ఎవరు నాతో చర్చకు వస్తారు రండి లెక్క తెలుస్తా

నేను చేసింది తప్పు అయితే,రాహుల్ గాంధీ చేసింది తప్పే

కులగణన బిసిలకు 54 శాతం రిజర్వేషన్ ఇస్తా మని రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ లో చెరిన

తీన్మార్ మల్లన్న రెక్కల కష్టం,బీసీ నేతలు కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ తీన్మార్ మల్లన్న కారణం

సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్నగర్ లో కాంగ్రెస్ ఓడిపోయింది

వంశీ చంద్ రెడ్డిని కుట్రపన్ని ఓడగొట్టాడు

సొంత మనిషి చామలకిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించిండు

మల్కాజి గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఓడిపోయింది

ఈ రెండు పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలిస్తే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకపోయేది

పరోక్షంగా మోడీ కి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు

బీసీ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుండ్రు

ఇలాంటి వారు చాలామంది వచ్చి పోయారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు ఇచ్చిన బూస్టింగ్ భవిషత్ తరాలకు ఉపయోగపడుతుంది

మేము మలిదశ బిసిలం

వెనుకటి బిసిలం కాదు

కులగణన కాపీలు తగలబెట్టడం తప్పు అయితే

బిసిల కోసం ఆ తప్పు వెయ్యి సార్లు చేస్తా

రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం నాకు ఉంది

కేవలం ఇక్కడ ప్రభుత్వం తప్పు చేస్తుంది

కులగణన విజయవంతం చేయాలని పండగ వాతావరణం లాగ ముఖ్యమంత్రి మంత్రులు,చేసేవారు

గతంలో కేసీఆర్ సమగ్ర కులగణన చేస్తే దుబాయ్ నుండి వచ్చారు

కాంగ్రెస్ చేసిన సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు

బీసీలను అనగదొక్కే సర్వే అది

3,54,000 ఇండ్లు 16లక్షల మంది పాల్గొనలేదు అని మీకు ఎట్లా దొరికింది

సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తప్పు చేస్తుండు

కులగణన ద్వారా ఓసీలు రిజర్వేషన్ పెరిగింది

సీఎం రేవంత్ రెడ్డి పక్కన నాలాంటి వాళ్ళు ఉండటం ఆయనకు ఇష్టం ఉండదు

కొత్తగా 32లక్షల కొత్త ఇండ్లు వస్తే తెలంగాణ జనాభా 3కోట్ల 90 లక్షలు ఉండాలి

కేవలం EWS కోటాను కాపాడటం కోసమే

Ews కోటా ద్వారా 25 వేల ఉద్యోగాలు దొంగతనంగా తీ సుకపోయారు

మీ సర్వే తప్పు అని నిరూపిస్తా

బీసీల సర్వే లో పొరపాటు జరిగితే మీ తప్పును సరిదిద్దుకోండి

బీసీలను కించపరిస్తే ఎవ్వరిని వదిలిపెట్టము

2028 లో బీసీలు ముఖ్యమంత్రి అయ్యి తీరుతడు

కార్పొరేషన్ పదవుల లో బీసీ ల పేరుతో పదవులు పప్పు బెల్లం పంచుకున్నారు

బీసీలకు 42శాతం,కాంట్రాక్ట్ లలో అన్యాయం జరిగితే బరాబర్ కొట్లాడతాం

రేపటినుండి గ్రామ గ్రామాన బీసీ వాదాన్ని తీసుకపోతాం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ 142 ఏండ్ల చరిత్రను,బీజేపీ చరిత్రను బీసీ బిడ్డ తలకొరివి పెడుతుండు.

నేను పార్టీ పెట్టాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

బీసీ మేధావులతో చర్చించి భవిషత్తు కార్యాచరణ ప్రకటిస్తాం..