తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై నిజామాబాద్‌ జిల్లాలో మరో కేసు నమోదైంది..

తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై నిజామాబాద్‌ జిల్లాలో మరో కేసు నమోదైంది. నిజామాబాద్‌కు చెందిన ఉప్పు సంతోష్‌ రూ.20 లక్షలు, తీన్మార్‌ మల్లన్న రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారంటూ నగరానికి చెందిన ఓ కల్లు వ్యాపారి ఆదివారం జిల్లా కేంద్రంలోని నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికప్పుడే ఉప్పు సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మల్లన్న జైలులో ఉండడంతో పోలీసులు ఆయన కోసం పీటీ వారెంట్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కేసులో సంతోష్‌ను ఏ1గా, తీన్మార్‌ మల్లన్నను ఏ2గా చేర్చారు..