తిరుమలలో చిక్కిన ఆరో చిరుత…
లక్ష్మీనరసింహ ఆలయం 2850 మెట్టు వద్ద ట్రాప్ బోనులోకి వచ్చి చిరుత చిక్కుకుంది. దీంతో ఇప్పటివరకు తిరుమలలో మొత్తం 6 చిరుతలను బంధించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో చిరుతల సంచారంతో భక్తులు భయాందోళనతో వణికిపోతూనే ఉన్నారు. అయితే, శేషాచలం కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ సక్సెస్ అవుతుందనే చెప్పాలి.. వరుసగా చిరుతలు అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుతున్నాయి.. నడక మార్గంలో జరిగిన దుర్ఘటనలతో అలర్ట్ అయిన టీటీడీ.. ఫారెస్ట్ అధికారులతో కలిసి ఆపరేషన్ చిరుత చేపట్టారు.. చిరుత, ఇతర అడవి జంతువుల కదలికలను గుర్తించడానికి నడకమార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
చిరుత కదలికలను గుర్తించి బోన్‌లు ఏర్పాటు చేస్తూ వస్తుండగా.. వరుసగా చిరుతలను చిక్కుతున్నాయి.. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించిన ఫారెస్ట్ అధికారులు. ఈ రోజు మరో చిరుత బోనులో చిక్కింది.. దీంతో.. ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులకు చిక్కిన చిరుతల సంఖ్య ఆరుకు చేరింది.. చిన్నారి లక్షితలపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే ఆరో చిరుతను ట్రాప్ చేశారు అటవీ శాఖ అధికారులు..