శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం…

R9TELUGUNEWS.COM.: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందించారు.
.. సుమారు రూ.3కోట్ల విలువచేసే బంగారు వరద కఠి హస్తాలను అందజేశారు. వజ్రాలు, కెంపులు పొదిగి దాదాపు 5.3కిలోల బరువు గల ఆభరణాలను తితిదే అధికారులకు అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి వాటిని అందించారు. అనంతరం భక్తుడిని ఆలయ అధికారుల సత్కరించారు. దాత వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు…