తిరుపతిలో నడిరోడ్డుపై మహిళ ప్రసవించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది…!!

ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక టీమ్ అసలు వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది…తిరుపతిలో మహిళకు ప్రసవం ఘటనలో.. సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేసి.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేశారని పేర్కొంది…ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. కానీ, తిరుపతి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉందంటూ చేసిన ఆరోపణలు అవాస్తవమంటూ స్పష్టంచేసింది…సదరు మహిళ మానసిక సమస్యతో బాధపడుతుందని పేర్కొంది…ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తిరుపతిలో రోడ్డుపై వదిలేసి వెళ్లారని.. అంతేకాదు ఆమెకు గర్భం గురించి తెలియని పరిస్థితుల్లో ఉందని తెలిపింది. ఇప్పుడు మహిళ, ఆమెకు జన్మించిన పాప ఆరోగ్యంగా ఆస్పత్రిలో ఉన్నారని తెలిపింది.