చిరుత దాడి లో చిన్నారి మృతి…!

🔴 *BREAKING NEWS*

చిరుత దాడి లో చిన్నారి మృతి.

తిరుమల
తిరుమలలో దారుణం జరిగింది. బిడ్డతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. అలిపిరి నుంచి నడకమార్గంలో కొండపైకి బయలుదేరిన కుటుంబానికి చెందిన చిన్నారిపై చిరుత దాడి చేసి ఎత్తుకెళ్లిపోయింది. అప్పటి వరకు కళ్ల ముందున్న చిన్నారి చిరుత దాడిలో చనిపోవడంతో పాప తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం తిరుమలకు వెళ్లింది. రాత్రి 8 గంటల సమయంలో వారంతా అలిపిరి నుంచి నడకమార్గంలో కొండపైకి బయలుదేరారు. రాత్రి 11గంటల సమయంలో వారు లక్ష్మీ నరసింహ స్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంతలో ముందు వెళ్తున్న ఆరేళ్ల వయసున్న లక్షితపై చిరుత దాడి చేసింది. తల్లిదండ్రులు కేకలు వేయడంతో అడవిలోకి ఈడ్చుకుపోయింది… అలిపిరి నడకమార్గంలో నిన్న రాత్రి తప్పిపోయిన చిన్నారి.. స్థానిక లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారి మృతదేహం లభ్యం . తిరుమల అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం ..మృతి చెందిన బాలిక లక్షిత (6) గుర్తింపు.. ఈమధ్య కాలంలోనే ఒక బాలుడు పై కూడా దాడి చేసిన విషయం తెలిసిందే…