తిరుపతిలో అక్కా తమ్ముడి దారుణహత్య..

*తిరుపతిలో అక్కా తమ్ముడి దారుణహత్య…

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. కపిలతీర్థం సమీపంలోని ఓ హోటల్‌లో అక్కాతమ్ముడు హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్‌ కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుపతి చేరుకున్నాడు..

ఓ ప్రైవేట్‌ హోటల్‌లో అద్దెకు దిగారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన భార్య మనీషా, బావమరిది హర్షవర్ధన్‌ను యువరాజ్‌ కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు.

అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది..