వేంకటేశ్వర స్వామి నిలువ నామం…..

వేంకటేశ్వర స్వామి నిలువ నామం…..

వేంకటేశ్వర స్వామిని చూడగానే మనకు మొదటగా కనపడేది ముఖం మీద పెద్దగా ఉన్న నామమే. తిరుమలకు వెళ్లిన చాలా మంది భక్తులు భక్తితో ఈ నామం ధరిస్తారు. అంతటి విశిష్టత కలిగిన నామం కు రెండు రంగులు ఉంటాయి..

మొదట తెలుపు రంగుతో Y ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా ఒక నామం పెడతారు.. ఈ తెల్లటి నామాన్ని తిరునామం అంటారు. తిరు అంటే పవిత్రమైన నామం అంటే చూర్ణం అని తమిళములో అర్థం..

వేంకటేశ్వర స్వామికి వాడే తిరునామం కర్ణాటక లోని మేలుకొటే అనే క్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అభ్రకం నుండి తెస్తారు. ఈ మేలుకొటే మైసూరు దగ్గర ఉంది. ఇక్కడ ప్రసిద్ధి పొందిన చలువ నారాయణ స్వామి గుడి ఉంది.

రెండవ ది మధ్యలో ఉన్న చిన్నగా ఉన్న ఎర్రటి నామాన్ని శ్రీ చూర్ణం అంటారు. ఈ శ్రీ చూర్ణం పసుపు, సున్నం కలిపి పెడతారు.

సంప్రదాయం ప్రకారం వైష్ణవంలో రెండు శాఖలు ఉన్నాయి. అవి తెంగలై, వడగలై.

తెంగలై వారు నుదుటి నుండి ముక్కు వరకు వచ్చే తెల్లటి నామం పెడతారు.

వడగలై వారు ఎర్రటి లేదా గంధపు రంగు గీత నామం పెడతారు.

ఈ రెండూ కలిపి వేంకటేశ్వర స్వామి నామం ఉంటుంది.

ఈ నామంలో ఉండే రెండు తెలుపు గీతలు విష్ణువు పాదాలుగా, మధ్యలో ఉండే ఎర్రటి గీత లక్ష్మీ దేవిగా చెబుతారు.. ఒక సంప్రదాయం ప్రకారం విష్ణువు, లక్ష్మీ దేవి విడిగా ఉండరని అందుకే స్వామి వారి తెలుపు గా లక్ష్మీ దేవి గా ఎరుపు కలిసి ఉంటాయి.

తిరుమలలో ప్రతి శుక్రవారం నాడు ఉదయం అభిషేక సేవ అనంతరం స్వామికి ఈ నామం పెడతారు. మరలా శుక్రవారం వారం వరకు ఆ నామం అలానే ఉంటుంది. శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తారు. అందుకే శుక్రవారం అభిషేక సేవ, నిజ పాద దర్శనంకు వెళ్లే వాళ్ళు నామం లేకుండా స్వామిని చూడొచ్చు.

నామం ఎలా పెట్టాలి, వేటితో కలిపి పెట్టాలి, పెట్టే సమయంలో ఏ మంత్రం చదవాలి అని పరాశర స్మృతి అనే గ్రంథంలో విపులంగా వ్రాసారు…