*ఈరోజు మద్యాహ్నం 3గంటలకు బారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్…
స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్షప్రసారం..
మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈరోజు అంటే సెప్టెంబర్ 2వ తేదీన శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. అసలు సిసలు మ్యాచ్ ఇవాళ జరగనుంది. టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. హాట్ ఫేవరైట్‌గా ఇండియా బరిలో దిగుతుంది…
పాకిస్తాన్‌తో టీమ్ఇండియా తలపడుతుందంటే ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆసియా కప్ 2023లో భాగంగా రేపు (శనివారం సెప్టెంబర్ 2న) శ్రీలంకలోని పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించి ఆసియా కప్ 2023లో బోణీ చేయాలని సగటు భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ (Matthew Hayden) భారత బ్యాటర్లకు పలు కీలక సూచనలు చేశాడు…
వన్డే ఫార్మట్‌లో జరిగే ఆసియా కప్ కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. గత కొద్దికాలంగా టీమ్ ఇండియా చాలా ప్రయోగాలు చేస్తూ వస్తోంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, బూమ్రా వంటి ఆటగాళ్లకు గాయాలు కావడంతో కీలక ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతినిస్తూ వచ్చింది. ఆసియా కప్ 2023ని ప్రీ ప్రపంచకప్‌గా భావిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ రెండు జట్లూ ప్రపంచకప్ జట్టును ఖాయం చేసేందుకు ఆసియా కప్‌ను వేదికగా చేసుకుంటోంది. ఆల్ రౌండర్ జడేజా, హార్ధిక్ పాండ్యా, సిరాజ్, రోహిత్, విరాట్ వంటి సైన్యంతో ఇండియా సిద్ధమౌతోంది.
ఇవాళ్టి మ్యాచ్ నిజంగానే హై వోల్టేజ్ కానుంది. ఇండియా పాకిస్తాన్‌లో తలపడిన గత 5 వన్డేలు పరిశీలిస్తే ఇండియా 4 విజయాలు, పాకిస్తాన్ 1 విజయం సాధించాయి. ఆసియా కప్‌లో ఇండియాతో తలపడేందుకు పాకిస్తాన్ తన తుది జట్టును ప్రకటించింది….