నేడు సీఎం కేసీఆర్ నామినేషన్…

*నేడు సీఎం కేసీఆర్ నామినేషన్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ ముఖ్యనేతలు నామినేషన్లు వేయనున్నారు.

నేడు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు.

సాయంత్రం 4గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడురోజుల పాటు కేసీఆర్ సభలకు విరామం ఇవ్వనున్నారు. తిరిగి పదమూడు నుంచి మూడో విడత కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఈ రోజు ఉదయం 11.45 గంటలకు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 11గంటలకు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్నారు.

ఉదయం 11గంటలకు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు..