నేడు ఉప్పల్, మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన..

బిఆర్‌ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షులు మాజీ మంత్రి కె.తారక రామారావు ఆదివారం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్, మల్కాజ్‌గిరి నియోజక వర్గాల్లో పర్యటించను న్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్ లోని విఎన్‌ఆర్ గార్డెన్స్, హాల్ 1 లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం కానున్నారు.

అ దేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్‌గిరి ని యోజక వర్గం గౌతమ్ నగర్ డివిజన్ లోని లక్ష్మీ గార్డె న్స్‌లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించ నున్నారు.

ఈ రెండు సమావేశాల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసు కోవడమే లక్షంగా పార్టీ కార్యకర్తలకు ఆయన దిశా నిర్ధేశనం చేయనున్నారు.