నేడు హైదరాబాద్ కు ఏపీ సీఎం.. కేసీఆర్ ను పరామర్శించిన జగన్..

నేడు హైదరాబాద్ కు ఏపీ సీఎం.. కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్

అమరావతి..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేడు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్‌ పరామర్శించనున్నారు..

ఉదయం 11:30 గంటలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌….

. నేటి ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్‌ రానున్న జగన్, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లనున్నారు.
గత నెల 8వ తేదీన కేసీఆర్‌ గజ్వేల్‌ ఫాంహౌజ్‌లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు. కొద్దికాలం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు..కేసీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నాయకులు, బీఆర్‌ఎస్ నేతలు ఆయనను పరామర్శించారు. అనంతరం కేసీఆర్‌ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో గల ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. అక్కడే కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేటీఆర్‌కు ఫోన్‌ చేసిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు సీఎం జగన్. కాగా ఇవాళ సీఎం జగన్‌ నేరుగా వెళ్లి పరామర్శించనున్నారు. కేసీఆర్‌ ఇంటికి వెళ్తున్న జగన్‌ లంచ్‌ మీటింగ్‌కు హాజరవుతారని సమాచారం.