నేటి వార్తలు…

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండల వేళ.. ఉరుముల వాన*

_ఎండల వేళ_.. _ఉరుముల వాన_
_రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది._

_కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అసౌకర్య వాతావరణం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

*రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ*

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది.

నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం దిలో ముగ్గురికి ఈడీ నోటీ సులు ఇచ్చింది.

సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు సమా చారం.

కాగా కవిత అరెస్టును సవాల్‌ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు.

*🔹పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే*

కేసిఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిశాం.

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేయాలని కోరాం.

ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదు.

రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పాడు.

అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని చెప్పాడు.

ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అదే బీడీలు అమ్మిస్తారా?.

మూడు నెలలో పార్టీ మారిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పింది.

నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడటం సరికాదు.

మేము ఒక అడుగు వెనకడుగు వేశాం అంటే నాలుగు అడుగులు ముందు కు వేస్తాం.

ఒక దెబ్బ మీరు కొట్టారు, మేము కొట్టడానికి సిద్దంగా ఉన్నాం.

మీరు గేట్లు తెరిచారని అంటున్నారు మేము తెరిచే టైం వచ్చింది తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం..

*టిడిపిలో నిరసన గళం,ఆదిమూలం వద్దే వద్దు..

టిడిపి అభ్యర్థి ప్రకటనతో నిరసనలు పెరుగుతున్నాయి ప్రధానంగా సత్యవేడు టిడిపి అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిమూలను టిడిపి అధిష్టానం ప్రకటించింది ఆదిమూలం వల్ల తీవ్రంగా నష్టపోయామని, కేసులకు, మానసికంగా, ఆర్థికంగా నియోజవర్గంలో తీవ్రంగా తెలుగుదేశం కార్యకర్తలు నష్టపోవడం జరిగిందని టిడిపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిమూలం వద్దే వద్దు… కొత్త వారే ముద్దు అనే నినాదంతో సత్యవేడు బేరి శెట్టి కళ్యాణ మండపం వద్ద స్థానిక టిడిపి పట్టణ నాయకులు, మండల నాయకులు ఏకమై టిడిపి అధిష్టానం వెంటనే కళ్ళు తెరిచి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఒక్కొక్కరుగా విలేకరులతో ఆదిమూలం చేసిన అన్యాయాలను వివరిస్తూ వస్తున్నారు..

మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన.

హైదరాబాద్, మార్చి 18: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ హిస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన విద్యార్థులు… మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు మైనం పల్లి హనుమంత్ రావు కాలేజ్‌కు వచ్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడుతున్న ఆయన.. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు…

తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా. తమిళనాడు నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం.. చెన్నై సౌత్‌, తిరునల్వేలి, కన్యాకుమారిలో.. ఏదో ఒకచోట పోటీ చేసే యోచనలో తమిళిసై. నాడార్‌ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై, తిరునల్వేలి, కన్యాకుమారిలో.. అత్యధికంగా నాడార్‌ సామాజికవర్గం ఓట్లు..

భారీ ప్రచారానికి వైయస్.జగన్ సిద్ధం.

తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభ..

మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర..

రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ..

ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర..

బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్.జగన్.

బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్.

మరో వారంరోజుల్లో బస్సు యాత్ర ప్రారంభం.

ఈనెల 26 లేదా 27 తేదీల్లో ప్రారంభం.

దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర.

4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా ..
ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర.

ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ.

ఇంటరాక్షన్లో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వ పనితీరును మరింతగా.మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరణ..బస్సు యాత్రపై పూర్తి వివరాలు రేపు వెల్లడి.

కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి..

కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం..

అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి..

ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం..

……..
బీఆర్ఎ‌స్‌లో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్..

హోం ఓటింఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనతో నడిచిన అందరికి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తాను ప్ర‌జా సేవ కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను తప్పా ప్యాకేజీల కోసం కాదని స్ప‌ష్టం చేశారు..సోమవారం ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆర్ఎస్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ స్థానం నుంచి నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు..

*వందేళ్ల తర్వాత హోలీ రోజే చంద్ర గ్రహణం..

గర్భిణీలు జాగ్రత్తగా ఉండాల్సిందే!*. హిందూ సంప్రదాయం ప్రకారం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటారు. అంటే మార్చి 25న హోలీ పండుగ. అయితే వంద సంవత్సరాల తర్వాత హోలీ పండుగ రోజే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈసారి చంద్రగ్రహణం మార్చి 25 ఉదయం 10:24 నుండి మధ్యాహ్నం 3:01 గంటల వరకు ఉంటుంది. అంటే గ్రహణం మొత్తం 4 గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఈ సమయంలో అస్సలే బయటకు రాకూడదు. ఎందుకంటే గ్రహణం యొక్క కాంతి గర్భిణీ స్త్రీలు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే కత్తెర, సూది, కత్తులు లాంటివి అస్సలు వాడకూడదు. వీలైనంత వరకు గర్భిణీలు ఈ సమయంలో నిద్రపోవడం చాలా మంచిది అంటున్నారు పండితులు..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ.

హైదరాబాద్:మార్చి 18
సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి.
హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో తిరుగు ప్రయాణం అయ్యారు..
హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషా బాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీ ఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది..

*మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజెపిలో చేరుతున్నారన్నది ఆవాస్తవం: డీకే అరుణ వెల్లడి..

ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజెపి పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని బిజెపి జాతీయ ఉప అధ్యక్షురాలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ వెల్లడించారు, పాలమూరు జిల్లాలో భారత ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడంతో జిల్లావ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓటు వేయడానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారని ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకులు లేనిపోని మాటలు చెప్పి ఓటు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాలు పద్మజ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాండురంగారెడ్డి పాల్గొన్నారు..