నేడు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి: నిర్మలమ్మ.

న్యూ ఢిల్లీ:ఫిబ్రవరి 01
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టనుంది.

ఇది పూర్తిస్థాయి పద్దు మాత్రం కాదు. లోక్ సభ ఎన్నికల ఎన్నికల ముంగిట.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల మధ్య.. 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది.

ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.