విభజించి – పాలించు అని చెప్పే కణిక నీతి కథ..!!!

✍? *నేటి కథ* ✍?

*విభజించి – పాలించు అని చెప్పే కణిక నీతి కథ*

*అనగా అనగా….. ఈ కథ మహా భారతం, ఆది పర్వంలోనిది*

*కౌరవ పాండవుల విద్యా ప్రదర్శన ముగిసింది. ప్రజల్లో పాండవుల పట్ల ఆదరణా, ఆరాధనా పెరిగిపోతున్నాయి. అనివార్యమై ధర్మరాజుకి యువరాజుని చేశాడు ధృతరాష్ట్రుడు. సద్గుణ సంపన్నుడూ, దయార్ధ్ర హృదయుడూ, ధెర్యస్ధెర్య సమన్వితుడూ అయిన ధర్మరాజు తన ప్రవర్తనతో ప్రజల మనస్సులను గెలుచుకున్నాడు. అర్జునుడు సోదరులతో జైత్రయాత్ర చేసివచ్చాడు. నానాటికి పాండవుల కీర్తి పెరిగిపోయింది.*

*ఇది ధృతరాష్ట్రుని హృదయాన్ని కలచివేసింది. ధృతరాష్ట్రునికి ముగ్గురు మంత్రులు.*

*అందులో ప్రధాని విదురుడు. ఈయన విద్వాంసుడు, ధర్మపరుడు, నీతికోవిదుడు. నిష్కర్షగా రాజు లోటుపాట్లని నిస్సంకోచంగా ముఖమ్మీదే చెప్పగల ధైర్యశాలి.*

*రెండవ వాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు. వినయశీలి.*

*మూడవ వాడు కణికుడు. ఈయన కూటనీతి కుశలుడు. అంటే మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు.*

*అలాంటి కణికుడిని ధృతరాష్ట్రుడు ఏకాంతానికి రప్పించి తన బాధ, కాంక్ష తెలియజేశాడు.*

*ఆ నీతివేత్త “మహారాజా! శతృనాశనానికి ముందు వారి ఉత్సాహ, ఐశ్వర్య, మంత్రాంగాలనే మూడు మార్గాలను నాశనం చేయాలి. అమాత్య[అంటే మంత్రులు, కార్యదర్శులన్న మాట], దుర్గ[అంటే పట్టణాలు, నగరాలన్న మాట], కోశ[అంటే ధనపునిల్వలు], సేన[పాలనా యంత్రాంగం, సైన్యాలు], రాష్ట్రాలు[రాజ్యంలోని అంతర్భాగాలన్న మాట] ఈ ఐదు వర్గాలనూ నాశనం చేయాలి.*

*సామ దాన భేద దండ ఉద్భంధన విషప్రయోగ అగ్ని ప్రసరణ మార్గాలలో శత్రువుల్ని నాశనం చేయాలి. శతృబలాన్ని మొదలంటూ నాశనం చేసి, తర్వాత వారి ఆశ్రయు వర్గాన్ని [అంటే అనుచరవర్గం అన్నమాట] నాశనం చేయాలి.*

*శతృవులని విభజించి గెలవాలి.*

*మహారాజా! వారిలో పిరికి పందల్ని భయపెట్టాలి. లోభికి ధనమిచ్చి లోబరుచుకోవాలి. బలహీనుడయితే పరాక్రమంతో స్వాధీనం చేసుకోవాలి. సమబలునితో స్నేహం చేయాలి. విషం తినిపించి గానీ, మోసగించి గాని శతృవుని క్రమంగా కడతేర్చాలి.*

*ఇది నీతి శాస్త్రం చెప్పే విషయం!*

*శతృవుని సాధించ దలిచినప్పడు [అంటే హెరాజ్ చెయ్యాలనుకొన్నప్పడు] క్రోధం పనికిరాదు. చిరునవ్వుతో చరిస్తూ వాడికి విశ్వాసం కలిగించి పాములా కాటు వేయాలి. ఎటువంటి ఘాతకం తలపెట్టినా ఆ విషయం పైకి తెలియకుండా, చిరునవ్వుతో, మృదుభాషణ తో ఓరిమి వహించి అదునెరిగి నెరవేర్చుకోవాలి.*

*ఆశలు రేకెత్తించాలి కాని అవి నెరవేర్చకూడదు. అలాగని ఆ భావం ఎదుటి వారికి తెలియనివ్వకుండా వాయిదాలు వేస్తుండాలి. ఇనుముతో చేసిన కత్తిని తోలు కవచంతో భద్రపరచి, అవసరానికి తీసి కేశ ఖండనానికి వినియోగించి నట్లుండాలి. మన మంత్రాంగం, మనం ఏ పనిచేసినా అది మనకి మరిన్ని ఆపదలు తెచ్చిపెట్టకూడదు.*

*ఒక కథ చెబుతాను వినండి మహారాజా*