నేటి కథ…నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి….

*అనగా అనగా….. ఒక గురువు గారు ఓ పల్లె ప్రక్కన గల అడవిలో ఓ గురుకులం నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులుండే వారు. వారిలో ఒక శిష్యుడు గురువు పట్ల ఎంతో వినయం, గౌరవం, మీదు మిక్కిలి నమ్మకం కలవాడు.*

*ఓ రోజు గురువుగారు కొద్దిమంది శిష్యులతో కలిసి చిన్ననది పాయకి స్నానానికి వెళ్ళారు. ఆ సమయంలో ఈ శిష్యుడు నదికి ఆవలి వైపున ఉన్నాడు. గురువు గారు శిష్యుణ్ణి తన దగ్గరికి రావలసినదిగా సైగ చేసారు. శిష్యుడు పడవకోసం వేచి చూడలేదు. నది కడ్డంపడి నడవసాగాడు. గురువు మీద నమ్మకం ఉంచి, గురునామం ధ్యానిస్తున్నాడు.*
*ఆశ్చర్యం! అతడు నీటిలో మునిగి పోలేదు. నడవ గలుగుతున్నాడు.*

*గురువు అది చూశాడు. తన శిష్యుడి శక్తి చూసి అతడికి చాలా సంతోషం, గర్వం కలిగాయి. ’నా పేరుకే ఇంత మహిమ ఉంటే నాకు మరింత మహిమ ఉండి ఉండాలి. నేను నడుస్తాను నీళ్ళమీద’ అనుకున్నాడు గురువు.*

*నదిలోకి దిగి నడవడానికి ప్రయత్నిస్తూ ’నేను నేను’ అని తన పేరు జపించసాగాడు.*

*అంతే! నీళ్ళల్లో మునిగి చనిపోయాడు.*

*నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి.*