నేటి కథ…ఎద్దు కొమ్ముపై ఈగ.
*ఒక ఎద్దు మైదానంలో గడ్డి మేస్తోంది. పచ్చని గడ్డి తింటూ, తన పని తను చేసుకుంటూ, యే ఆలోచన పెట్టుకోకుండా సంతృప్తిగా వుంది.*
*ఇలా హాయిగా వున్న ఎద్దు చుట్టూ కాస్సేపటికి ఒక ఈగ ముసరడం మొదలెట్టింది. ఎద్దు కొమ్ములపై వాలింది.*
*కొంతసేపటికి అలసట తీరాక ఈగ తన దారిని తను వెళ్తూ ఎద్దుతో, “ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, నీ మీద వాలి అలసట తీర్చుకో నిచ్చినందుకు చాలా థాంక్స్. ఇప్పుడు నేను వెళ్తుంటే నీకు హాయిగా ఉందేమో” అంది.*
*ఎద్దు ఆశ్చర్యంగా ఈగవైపు చూస్తూ “అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టే నాకు తెలీదు” అంది.*
*కొంతమంది వాళ్ళని వాళ్ళే చాలా గొప్ప అనుకుంటారు. కాని ఇతర్ల దృష్టిలో మట్టుకు వారికి అంత ప్రాముఖ్యత వుండదు.*