నేటి కథ.
*విన్నవన్నీ నిజాలు కావు**
*ఒక రోజు తోడేలు ఆహారం వెతుక్కుంటూ ఒక గ్రామం వేపు వెళ్ళింది. అక్కడ ఒక ఇంటి దెగ్గిర తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతకడం తోడేలుకి అలవాటు.*
*ఇంట్లో ఖిడికి లోంచి ఒక పాప ఏడుపులు వినిపించాయి. కుతూహలం కొద్దీ ఏం జరుగుతోందో చూద్దామని ఖిడికి లోపలకి తొంగి చూసింది.*
*అక్కడ పాపని తల్లి ఎత్తుకుని, భుజం తడుతూ లాలిస్తోంది. ఏమి చేసిన పాప ఊరుకోవటం లేదు. చివరికి కొంచం విసుక్కుంటూ, “ఊరుకో పాపా, ఊరుకో – లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుతూ వుంటుందే, ఆ తోడేలుకి నిన్ను ఇచ్చేస్తాను! అది నిన్ను తినేస్తుంది!” అని తల్లి పాపని మందలించింది.*
*ఇది విన్న తోడేలుకి ఆశ కలిగింది. ఎప్పటికో అప్పటికి తల్లి పిలిచి పాపని తన చేతిలో పెడుతుందని ఊహించుకుంటూ పాప ఎడుస్తున్నంత సేపు ఖిడికి బైట కూర్చుని ఎదురు చూస్తూనే వుంది.*
*కొంత సేపటికి పాప ఇంకా ఏడుపు ఆపక పొతే తల్లికి అన్న మాటలకు బాధగా అనిపించి, “ఊరుకో పాప, ఊరుకో. తోడేలుకి నిన్ను ఇవ్వనులే, మీ నాన్నగారికి చెప్పి తోడేలుని బాగా కొట్టమని చెప్తాను” అని బుజ్జగించడం మొదలెట్టింది.*
*ఈ మాట విన్న తోడేలు హడిలి పోయింది. అప్పుడే ఇంటికి పాప తండ్రి తిరిగి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. పరుగో పరుగుమని తోడేలు అడివిలోకి పారిపోయింది.*
*మనం విన్న మాటలన్నీ నిజమనుకోకూడదు. సమయానుకూలంగా వాటిని పరిశీలించాలి.*