టాప్‌ న్యూస్‌..నేటి వార్త విశేషాలు.

R9TELUGUNEWS.COM. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ (Omicron) భారత్‌ను కలవరపెడుతున్నది.
ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఐదుకు చేరింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ వైరస్‌ను గుర్తించారు. పాజిటివ్‌ వచ్చిన మొత్తం 17 మంది ప్రయాణికుల్లో 12 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించామని, అందులో ఒకరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ చెప్పారు. ప్రస్తుతం వారంతా ఎల్‌ఎన్‌జేపీ దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు…ర్ణాటకలో రెండు కేసులు నమోదవ్వగా, శనివారం మరో రెండు కేసులు రికార్డయ్యాయి. నిన్న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒకటి, ముంబైలో మరో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. జింబాబ్వే నుంచి ఈ నెల 2న వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, జన్యుక్రమ విశ్లేషణ కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపించగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిందని గుజరాత్‌ హెల్త్‌ కమిషనర్‌ జయ్‌ ప్రకాశ్‌ శివహరే తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి గత నెల 23న ఢిల్లీకి, ఆ తర్వాత ముంబైకి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, నమూనాలను విశ్లేషించగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయిందని ముంబై అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితులిద్దరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.
********************************************************************************
అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు..

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రయులు ముగిశాయి. కొంపల్లి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్‌ హాజరయ్యారు.అంతకు ముందు గాంధీభవన్‌లో రోశయ్య పార్థీవ దేహాన్ని ఉంచారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్‌ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొంపల్లిలోని ఫాంహౌస్‌ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ఫాంహౌజ్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
****************************
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం.

కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడం ద్వారా కొవిడ్‌ కొత్త వేరియంట్‌కు దూరంగా ఉండవచ్చన్నారు. డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. దక్షిణాఫ్రికాలో 8 నుంచి 16 శాతానికి కేసులు పెరిగాయని, కొత్త కేసుల్లో 75శాతం ఒమిక్రాన్‌ కేసులు ఉన్నాయని చెప్పారు.వైరస్‌ తీవ్రత తెలిసేందుకు మరో వారం రోజులు పడుతుందని పేర్కొన్నారు. కేసులు పెరిగినా ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెరగట్లేదన్నారు. రాష్ట్రంలోకి విదేశాల నుంచి వచ్చిన వారికి ప్రతి రోజూ శంషాబాద్‌ విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 979 మందికి పరీక్షలు నిర్వహించామని, 13 మందికి పాజిటివ్‌గా తేలడంతో వారిని క్వారంటైన్‌కు తరలించినట్లు వివరించారు. వారికి ఒమిక్రాన్‌ ఉందో లేదో ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోతుందన్నారు.
*************************************************
నాగాలాండ్‌లో ఉద్రిక్తత..మిలిటెంట్లుగా భావించి స్థానికులపై కాల్పులు..

నాగాలాండ్‌లోని (Nagaland) మోన్‌ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం రాత్రి మోన్‌ జిల్లాలోని ఓటింగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులనే అనుమానంతో భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపాయి. దీంతో 13 మంది మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఘటనా స్థలంలో ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, కాల్పుల ఘటనపై ఆగ్రహంతో భద్రతా బలగాల వాహనాలను ప్రజలు తగులబెట్టారు.
శనివారం సాయంత్రం ఓటింగ్‌ ప్రాంతంలో మిలిటెంట్ల కదలికలు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా బొగ్గు గనిలో విధులు ముగించుకుని వెళ్తున్న కార్మికులను మిలిటెంట్లుగా భావించిన జవాన్లు.. వారిపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఓటింగ్‌ ఘటనపై నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెయిఫియు రియో స్పందించారు. కాల్పుల ఘటనను తీవ్రంగా ఖడించారు. దీనిపై విచారణ చేయడానికి తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తున్నానని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అన్నివర్గాల ప్రజలు శాంతించాలని, ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు చట్టపరంగా న్యాయం చేస్తామన్నారు.
***************************************************************
విశాఖ‌ ఆర్కే బీచ్‌ వద్ద స‌ముద్రం ముందుకొచ్చింది.అలల తాకిడికి భూమి బీటలు వారింది..

విశాఖపట్నం : జవాద్ తుఫాన్ ముప్పు త‌ప్పింద‌ని అనుకునేంతలోగా మ‌రో ముప్పు వ‌చ్చిప‌డింది. విశాఖ‌ ఆర్కే బీచ్‌ వద్ద స‌ముద్రం ముందుకొచ్చింది. అలల తాకిడికి భూమి బీటలు వారింది. ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోవడంతో స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.చిల్ట్రన్ పార్క్‌లో అడుగుమేర భూమి కుంగిపోయింది. పార్క్‌లోని బ‌ల్లలు ఒక పక్కకు ఒరిగిపోగా, ప్రహ‌రీగోడ కూలిపోయింది. పార్క్ బ‌య‌ట 10 అడుగుల మేర భూమి కుంగిపోయింది. అధికారులు అప్రమత్తమై పిల్లల పార్కుకు వచ్చే రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. పార్కు వైపు ఎవరూ రావడానికి వీలులేదని స్పష్టం చేశారు. పార్కు వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. విశాఖ‌కు జ‌వాద్ తుఫాన్‌ ముప్పు తప్పింద‌ని చెప్తున్నప్పటికీ.. స‌ముద్రం ముందుకు రావ‌డంతో స్థానిక ప్రజలు ఆందోళ‌న చెందుతున్నారు.

********************************************
ఐరన్ బోల్టుల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం…
నల్గొండ జిల్లా.. నకేరేకల్ శివార్లలోని ఐటిపాముల గ్రామంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర ఫెర్రీ లైస్ ఐరన్ బోల్టుల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది..బొగ్గు,అల్యూమినియం, ఐరన్ మిశ్రమాన్ని మండించే బ్రయిలర్స్ లాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..నిమిషాల్లోనే మంటలు ఫ్యాక్టరీ లోని చిమ్నీ లాల్లోకి వ్యాపించి, అక్కడున్న మూడు ట్రాన్స్ఫార్మర్స్ లకు మంటలు అంటుకున్నాయి… దింతో మూడు ట్రాన్స్ఫార్మర్స్ లు భారీ శబ్దంతో పేలిపోయి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి…మూడు ఫైర్ ఇంజిన్ లు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి… ఫ్యాక్టరీలో ని కూల్ టవర్స్ కూడా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి… ఫ్యాక్టరీలో పని చేస్తున్న 100 మంది బీహార్ కూలీలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు….హైదరాబాద్ to విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఫ్యాక్టరీ ఉండటంతో రహదారిపై వచ్చి పోయే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు..
************************************
ఒక ప్రయివేట్ మెడికల్ కళాశాలలో 39 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ .

ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మధ్యలోనే ప్రస్తుతం అన్ని విద్య సంస్థలు నడుస్తున్నాయి. ఇక తాజాగా కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. కరీంనగర్ లోని ఒక ప్రయివేట్ మెడికల్ కళాశాలలో 39 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరికొంత మంది విద్యార్థులకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. ఇక కళాశాలలో ఒక్కేసారి ఇన్ని కరోనా కేసులు రావడంతో సెలవులు ప్రకటించింది యాజమాన్యం. అయితే గత ఆదివారం రోజు జరిగిన కళాశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు కరోనా బారిన పడ్డట్టు సమాచారం…
**************************************************
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్...

భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 69 పరుగులతో ఉన్న భారత జట్టు ఈరోజు 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లెర్ ఇచ్చింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో మయాంక్ అర్ధశతకంతో రాణించాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు వేగంగా అదే ప్రయత్నంలో వికెట్లు త్వరగా ఇచ్చేసారు. చివర్లో అక్షర్ పటేల్ కేవలం 26 బంతుల్లో 41 పరుగులు చేసాడు. దాంతో భారత జట్టు లీడ్ 539 పరుగులకు చేరుకుంది. 540 పగల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ కు అశ్విన్ షాక్ ఇచ్చాడు. మొదట కెప్టెన్ టామ్ లాథమ్ ను 6 పరుగులకే వెన్నకి పంపిన అశ్విన్… ఆ తర్వాత విల్ యంగ్, రాస్ టేలర్ ను పెవిలియన్ చేర్చాడు. దాంతో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ ను డారిల్ మిచెల్ (60) హాఫ్ సెంచరీతో ముందుకు నడిపిస్తుండగా.. అతడ్ని అక్షర్ వెన్నకి పంపాడు. ఆ వెంటనే టామ్ బ్లండెల్ రన్ ఔట్ అయ్యాడు. దాంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ కు ఇంకా రెండు రోజులు సమయం ఉన్న టీం ఇండియా గెలవాలంటే ఇంకా 5 వికెట్లు తీస్తే చాలు.. అదే కివీస్ గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాల్సి ఉంటుంది..