సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ…
రేవంత్ రెడ్డితో 36 మంది సినీ ప్రముఖుల సమావేశం...!
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడం జరిగింది.

తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలంతా తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈభేటీకి సీనియర్ దర్శకులు, నిర్మాతలు, నటులతో పాటు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యువ నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు పాల్గొన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇండస్ట్రీ పెద్దలు విచారం వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇకపై సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు ఏం చేయాలి..ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు…
ఇలా చేయండి.. ఇవే మా సమస్యలు..!
టాలీవుడ్లో పుష్ప2 సినిమా రిలీజ్ తర్వాత నెలకొన్న పరిణామాలను చూస్తుంటే ప్రభుత్వానికి..పరిశ్రమకు మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం అయ్యారు. పరిశ్రమలో ఉన్న తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సినీ పెద్దలు. అదే విధంగా టాలీవుడ్‌కి ప్రభుత్వం వ్యతిరేకం కాదని..ఎవరిపైన అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వం ఉద్దేశం కాదని సీఎం రేవంత్ రెడ్డి ఈసమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక అదే విధంగా సినిమా టికెట్లపై విధించే సెస్ డబ్బును రాష్ట్రంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ఉపయోగించాలని సీఎం సీనీ పెద్దలకు సూచించినట్లుగా తెలుస్తోంది.డ్రగ్స్, మహిళా భద్రత విషయంలో సినీ సెలబ్రిటీలు చొరవ చూపాలని రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇక బెనిఫిట్ షో, టికెట్ల పెంపు వంటివి ఇకపై ఉండవని సీఎం సీని పెద్దలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. పరిశ్రమలోని పెద్దలంతా ఒక్కొక్కరు ఒక్కో సమస్యను సీఎం దగ్గర లేవనెత్తినట్లుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటన తమను ఎంతగానో కలచి వేసిందని నిర్మాత అల్లు అరవింద్, నటుడు మురళీమోహన్ చెప్పారు.సినీ సెలబ్రిటీలు ఏ ఈవెంట్ నిర్వహించినా ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని..పోలీసులు సహాకరిస్తామంటేనే ప్రోగ్రామ్ నిర్వహించుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది..
సినీ పరిశ్రమ అభివృద్ధికి…సమస్యల పరిష్కారానికి…
ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ..
యూనివర్సల్ లెవెల్ స్టూడియో కావాలి…
యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేదే తమ కోరిక అని నాగార్జున తెలిపారు..
సిఎం రేవంత్ రెడ్డి..
🔹శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్..
– *ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్న సీఎం…*
– *అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే..!*
– *ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం…*
– తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి…
– డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి…
– టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి…
– ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి…
ఈ భేటీలో…డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి…శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…ఎఫ్డీసీ ఛైర్మన్…శ్రీ దిల్ రాజు…ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.