కృష్ణంరాజు ఎమోషనల్ మాటలు.. ప్రభాస్‌ మ్యారేజ్‌ గురించి చెబుతూ, ‘ ప్రభాస్‌ త్వరగా పెళ్లి చేసుకోవాలి… మనవడు మనవరాలు తో ఆడుకోవాలి….

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్రలో నటించిన సంగతి తెల్సిందే. ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆనందంగా ఉందని రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. ఆయన తెలిపారు. ఇటీవల ఇంట్లో జారీ పడడంతో కృష్ణం రాజు కాలుకు దెబ్బతగడం.. ఆ తర్వాత సర్జరీ కావడంతో ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఈ కారణంతోనే రాధేశ్యామ్ ప్రమోషన్స్‏లో ఆయన పాల్గొనలేకపోయారు..తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” ఈ సినిమా నాకు చాలా సంతోషాన్నించింది. ప్రభాస్.. నేను ఇంతకుముందు కలిసి నటించాం. ఈసారి మా అమ్మాయి ప్రసీద కూడా ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నేను పరమహంస పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్ర చూస్తే వివేకానందుడు రామకృష్ణ పరమహంస మదిరిగా అనిపిస్తుందని చెప్పాడు కృష్ణం రాజు. ఇక ప్రభాస్‌ మ్యారేజ్‌ గురించి చెబుతూ, ‘ ప్రభాస్‌ త్వరగా పెళ్లి చేసుకోవాలని తాను ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఆయన వీలైనంత త్వరగా మ్యారేజ్‌ చేసుకుంటే వారి పిల్లలతో ఆడుకోవాలని ఉందని చెప్పారు. ఇక ప్రభాస్‌ నటించిన చిత్రాల్లో `వర్షం` తన ఫేవరేట్‌ ఫిల్మ్ అన్నారు. అయితే తాను నటించిన `మనవూరి పాండవులు` చిత్రాన్ని ఇప్పుడు ప్రభాస్‌ హీరోగా రీమేక్‌ చేస్తే చూడాలని ఉందన్నారు. ప్రభాస్‌, పూజ జంటగా నటించిన `రాధేశ్యామ్‌` చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మించారు. ప్రసీద కృష్ణంరాజు కూతురు. ఈ చిత్రంతో తన ప్రొడక్షన్‌ బాధ్యతలు కూతురు ప్రసీదకి అప్పగించారు కృష్ణంరాజు..