రేపు భారత్‌కు రానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ రేపు భారత్‌కు చేరుకోనున్నారు.

ఈ సందర్బంగా ఆయన జైపూర్‌లోని ఆమెర్ కోట, హవా మహాల్‌ను సందర్శిం చనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని ఢిల్లీలోని జంతర్ మంతర్‌ ను సందర్శిస్తారు. జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.

చివరగా రాష్ట్రపతి భవన్‌లో రిసెప్షన్‌కు హాజరవుతారు…..