*🔹రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ*
_• మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ._
_• సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదిక పై చర్చించనున్న కేబినెట్._
_• బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించనున్న కేబినెట్._
_• 42% రిజర్వేషన్ల అమలు సాధ్య, అసద్యాలు , స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం._
*• రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం*
కాళేశ్వరం ప్రాజెక్టు, SLBC పునరుద్ధరణ, SRSP రెండో దశ పనులపై చర్చించనున్న కేబినెట్
రైతు భరోసా స్కీమ్‌కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.
మరికొన్ని ప్రభుత్వ పాలసీ విధానాలపై కేబినెట్ లో నిర్ణయం తుసుకొనే అవకాశం..
ఈ సందర్భంగా కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. హైకోర్ట్, సుప్రీంకోర్ట్ ఆదేశాల ఆధారంగా BC రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోది. స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించే అవకాశం ఉంది. కాళేశ్వరం, SLBC పునరుద్ధరణ, SRSP దశ-II పనులపై సమీక్ష చేయనున్నారు. మరో ప్రధాన అంశం రైతుభరోసా పథకంపై ప్రధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది…