టాప్ న్యూస్…

16 మంది ఝార్ఖండ్‌ వాసులకు విముక్తి.

R9TELUGUNEWS.COM చేపలు పట్టించే గుత్తేదారు దగ్గర పనిచేస్తున్న 16 మంది ఝార్ఖండ్‌ వాసులను ఏపీ పోలీసులు విముక్తి కల్పించారు. అమరావతి మీదుగా వారి సొంత రాష్ట్రానికి తరలించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. విజయవాడలో పని ఉందని ఓ మధ్యవర్తి 16 మంది ఝార్ఖండ్‌ వాసులను తీసుకొచ్చాడు. తరవాత నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి, కొల్లాపూర్‌ మండలాల పరిధిలోని మల్లేశ్వరం, ముచ్చుమర్రి, మంచాలకట్ట ప్రాంతాల్లోని కృష్ణానది తీరంలో చేపలను పట్టేందుకు ఇంకో గుత్తేదారుకు అప్పగించాడు. చేపల వేట సమయంలో అధికారులు, పోలీసులు దాడులు చేస్తే తప్పించుకోవాలని ఆ గుత్తేదారు కూలీలకు ముందే హెచ్చరించాడు. దీంతో నవంబరు 15 నుంచి కృష్ణాతీరం వెంట చిన్న గుడారాలు వేసుకొని రాత్రింబవళ్లు చేపలు పడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా మత్స్యశాఖ సిబ్బంది ఈనెల 1న దాడులు చేశారు. విషయం ముందే పసిగట్టిన కూలీలు అక్కణ్నుంచి ముందే పరారయ్యారు.

* అధికారులు దాడులు చేయొచ్చన్న సమచారాన్ని గుత్తేదారు ఝార్ఖండ్‌ వాసులకు ముందే చేరవేశాడు. దీంతో వారు రెండ్రోజుల ముందే మల్లేశ్వరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతం వారికి కొత్త కావడంతో భయంతో చిన్న బోట్లలో కృష్ణానది దాటారు. తిండీతిప్పలు లేకుండా రాత్రంగా తీరం వెంటే తలదాచుకున్నారు. ఎలాగోలా ఏపీ లోని కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రాంతానికి చేరుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన దాడులు, వారు పడిన ఇబ్బందుల గురించి విజవాడుకు తీసుకొచ్చిన మధ్యవర్తికి చరవాణిలో వివరించారు. రోజుకు 22 గంటలపాటు చేపలు పట్టే పని చేయిస్తున్నాడని బాధితులు వాపోయారు. దీన్ని కొందరు సోషల్‌ మీడియా ద్వారా ఝార్ఖండ్‌ రాష్ట్ర కార్మికశాఖకు చేరవేశారు. తీవ్రంగా స్పందించిన ఆ రాష్ట్ర కార్మికశాఖ, హోం మంత్రులు సీఎస్‌కు వివరించారు. ఆయన ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించారు. నవంబరు 30న కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణ, తాలూకా సీఐలు నాగరాజరావు, ప్రసాద్‌ కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు. కూలీలు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు.. ఎక్కడున్నారు.. తదితర వివరాలను ఆరా తీశారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి వివరాలు సేకరించామని నందికొట్కూరు పట్టణ సీఐ నాగరాజరావు ‘ఈనాడు’కు తెలిపారు. అప్పటికే ఝార్కండ్‌ వాసులు నందికొట్కూరు చేరుకున్నారని, వారిని గుర్తించి స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో భోజనం పెట్టించి అమరావతికి తరలించామన్నారు. అక్కణ్నుంచి సొంత రాష్ట్రానికి వెళ్లడానికి అధికారులు టికెట్లు సమకూర్చారని ఆయన తెలిపారు.

* ఏపీ పోలీసులు రక్షణ కల్పించి, క్షేమంగా పంపారని ఝార్ఖండ్‌ ప్రభుత్వం అభినందించింది. నందికొట్కూరు పోలీసుల పనితీరు బాగుందని ఆ రాష్ట్ర కార్మిక, హోంమంత్రులు, సీఎస్‌ ప్రత్యేకంగా అభినందించారని సీఐ నాగరాజరావు తెలిపారు…
****”””””**”””””************

మరో 25 ఎంఎంటీఎస్‌ సర్వీసులు అందుబాటులోకి.

R9TELUGUNEWS.COM: జంట నగరాలను కలుపుతూ నడిచే ఎంఎంటీఎస్‌ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పెంచింది. శుక్రవారం నుంచి మరో 25 సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. కరోనాకు ముందు రోజూ 121 సర్వీసులు నడిచేవి. తర్వాత 56 సర్వీసులను జూన్‌, జులై నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. గురువారం ప్రకటించిన 25తో మొత్తం అందుబాటులోకి వచ్చిన సర్వీసుల సంఖ్య 81కి చేరింది. తాజాగా ప్రకటించిన వాటిలో 10 సర్వీసులు లింగంపల్లి-సికింద్రాబాద్‌ మధ్య నడుస్తాయి.
***””*******************
*బలపడిన అల్పపీడనం..*

అమరావతి :

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం

శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం

విశాఖపట్నానికి 960 కి.మీ, గోపాలపూర్ (ఒడిశా)కు 1020 కి.మీ,
పారదీప్(ఒడిశా)కు 1060 కి.మీ దూరంలో కేంద్రీకృతం

దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు

శనివారం ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు

రేపు అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ,

ఎల్లుండి ఉదయం నుంచి 70-90 కి.మీ వేగంతో బలమైన గాలులు

మత్య్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదు

భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..

కె.కన్నబాబు,కమిషనర్ , విపత్తుల శాఖ.
***********””””*******

‘గాంధీలో నేటి నుంచి అత్యవసర సేవలే అందిస్తాం.

నీట్‌-పీజీ 2021 కౌన్సెలింగ్‌ జాప్యానికి నిరసనగా గాంధీ ఆసుపత్రిలో నాన్‌ ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌(ఫైమా) పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.

*****************

 • నేడు మరో 32 బస్తీ దవాఖానాలు ప్రారంభం..
 • R9TELUGUNEWS.comపేదలకు బస్తీలోనే నాణ్యమైన వైద్యాన్ని అందించే బస్తీ దవాఖానాలను జీహెచ్‌ఎంసీ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 226 ప్రాంతాల్లో సేవలందిస్తుండగా, మరో 32 బస్తీ దవాఖానాలను శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ గురువారం ప్రకటించారు. వీటితో కలిపి గ్రేటర్‌లో మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 258కి పెరగనుంది. నిర్మాణ దశలో ఉన్న మరో ఏడు ఈ నెలాఖరులోపు అందుబాటులోకి వస్తాయని, మరో 35 ఏర్పాటునకు స్థలాలను అన్వేషిస్తున్నామన్నారు. మొత్తం 350 చేయడమే లక్ష్యమని కమిషనర్‌ పేర్కొన్నారు.

  తాజాగా ఏర్పాటు కానున్న ప్రాంతాలు..

  నాచారం-6 డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీ.
  చిలుకానగర్‌-7లోని బీరపాడు రామాలయం సమీప సామాజిక భవనం.
  హబ్సిగూడ-8లోని వికలాంగుల ఉన్నత పాఠశాల.
  చవానీ-29లోని బాగ్‌-ఇ-జహ్రా సామాజిక భవనం.
  రెయిన్‌బజార్‌-31 ముర్తుజానగర్‌ బాలికల ప్రాథమిక పాఠశాల.
  లలితాబాగ్‌-36లోని ఫతేషానగర్‌ కొనైనా మసీదు.
  రియాసత్‌నగర్‌-40లోని సామాజిక భవనం.
  కంచన్‌బాగ్‌-41లోని క్లాసిక్‌ గార్డెన్‌ వద్ద మజీద్‌-ఇ-ఒమర్‌ ఫరూఖి సి బ్లాక్‌.
  నవాబ్‌సాహెబ్‌ కుంట-47లో అచ్చిరెడ్డినగర్‌ సామాజిక భవనం.
  గోషామహల్‌-51.. దూల్‌పేట చంద్రకిరణ్‌ బస్తీ సామాజిక భవనం.
  పురానాపూల్‌-52లోని జలాల్‌ కుంచ సామాజిక భవనం.
  రామ్‌నస్‌పుర-55 చిరాక్‌గల్లీ సామాజిక భవనం.
  మెట్టుగూడ-144. దూద్‌ బావి.
  టోలిచౌకి-68లోని ఒవైసీ సామాజిక భవనం.
  మల్లేపల్లి-76 జాకీర్‌ హుస్సేన్‌ సామాజిక భవనం.
  గోల్నాక-82లోని కమగారినగర్‌ సామాజిక భవనం.
  ఖైరతాబాద్‌-91లోని మహాభారతనగర్‌ సామాజిక భవనం.
  షేక్‌పేట్‌-94లోని రాజీవ్‌గాంధీ నగర్‌ సామాజిక భవనం.
  జూబ్లీహిల్స్‌-95లోని గురుబ్రహ్మనగర్‌ సామాజిక భవనం.
  యూసుఫ్‌గూడ-96లో యూసుఫ్‌గూడ సామాజిక భవనం.
  శేరిలింగంపల్లి-106లోని నెహ్రూ నగర్‌ సామాజిక భవనం.
  చందానగర్‌-110లోని పాపిరెడ్డి సామాజిక భవనం.
  పాత బోయిన్‌పల్లి-119లోని కాలనీ సామాజిక భవనం.
  ఫిరోజ్‌గూడలోని బాలానగర్‌-120 వార్డు కార్యాలయం.
  హైదర్‌నగర్‌-123లోని వార్డు కార్యాలయం.
  చింతల్‌-128లో సామాజిక భవనం.
  సుభాష్‌నగర్‌-130లోని అపురూపకాలనీ సామాజిక భవనం.
  మచ్చబొల్లారం-133లోని హనుమాన్‌ టెంపుల్‌ దగ్గర.
  వెంకటాపురం-135లోని గోకుల్‌నగర్‌ పార్కు.
  నేరెడ్‌మెట్‌-136లోని చెక్‌పోస్ట్‌ సామాజిక భవనం.
  గౌతమ్‌నగర్‌-141లోని సామాజిక భవనం.
  బన్సీలాల్‌పేట-147లోని హమాలీ బస్తీ సామాజిక భవనం.
  ****************
  మేనల్లుడుతో అత్త వివాహేతర సంబంధం..

  *అనంతరం బ్లాక్ మెయిల్*

  చిన్న చిన్న గొడవలతో పచ్చని సంసారాలు కకావికలమవుతున్నాయి. ఈ విషయం బయటకు తెలియనీయకుండ దారుణాలకు తెగబడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలకు వేదన మిగిలిస్తున్నారు.

  వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును పెడుతున్నాయి. అక్రమ సంబంధాల చిచ్చు కాపురాల్లో కలహాలను రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనిపై లైంగికదాడి జరిపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది.
  లక్షల్లో డబ్బు కాజేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

  జూబ్లీహిల్ పీఎస్ పరిధిలో 14 ఏళ్ల మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. బాలుడిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. వీటిని బాలుడికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేసింది. ఈ వీడియోలు చూపెట్టి బాలుడిని బెదిరించింది. అంతేగాకుండ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది…దీంతో ఈ వీడియోలు ఎక్కడ బయటపడుతాయోనని ఆ బాలుడు బెదిరిపోయాడు. కుటుంబానికి తెలియకుండా ఆమె అడిగినంత ఇవ్వసాగాడు. మొత్తంగా 20 తులాల బంగారం, ఆరు లక్షల నగదు మేనత్తకు ఇచ్చాడు. కానీ అదే పనిగా బెదిరింపులు చేయడంతో బాలుడు నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. జరిగిందంతా చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు మేనత్తను విచారించారు. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
  *********************