టుడే టాప్ న్యూస్…

దేశంలో 25 ఒమిక్రాన్‌ కేసులు.. అందరిలోనూ స్వల్ప లక్షణాలే: కేంద్రం.

దేశంలో ఇప్పటి వరకు 25 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయని, అందరిలోనూ స్వల్ప స్థాయిలోనే లక్షణాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ దేశంలో కొవిడ్ స్థితిగతులపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నవంబర్‌ 24 నాటికి కేవలం రెండు దేశాల్లోనే ఒమిక్రాన్‌ కేసులు ఉండగా.. ఇప్పుడు ఈ వేరియంట్‌ బారిన పడిన దేశాల సంఖ్య 59కి చేరిందని వెల్లడించారు. అన్ని దేశాల్లో మొత్తం 2,936 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దేశంలో 78,054 నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించామన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా, స్క్రీనింగ్‌ కొనసాగుతోందని, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచాలని రాష్ట్రాలకు సైతం సూచించినట్లు వెల్లడించారు.

వ్యాక్సినేషన్‌తో పాటు ప్రజారోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని డబ్ల్యూహెచ్‌వో సూచించిందని, అందుకు అనుగుణంగా దేశంలో ఆ సూచనలు పాటిస్తున్నామని లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ప్రజారోగ్యం పట్ల అలసత్వం కారణంగానే యూరప్‌లో కేసులు పెరుగుతున్నాయని వివరించారు. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.73 శాతం ఉందని తెలిపారు. గత 14 రోజులుగా 10వేల్లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. అత్యధికంగా కేరళ, మహారాష్ట్రలోనే యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, లవ్‌ అగర్వాల్‌ వివరించారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ మాస్కుల ధరించడం తప్పనిసరి అని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ అన్నారు. దేశంలో మాస్కుల వినియోగం తగ్గడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న పరిస్థితుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు…
——————–

బిపిన్‌ రావత్‌ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు..

హెలికాప్టర్‌ ప్రమాదంలో వీర మరణం పొందిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు ఇతర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అనంతరం అమర వీరుల కుటుంబాలను పరామర్శించారు.

సాయితేజ మృతదేహం గుర్తింపు

తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్‌నాయక్‌ సాయితేజ భౌతికకాయాన్ని కూడా గుర్తించినట్లు భారత సైన్యం తెలిపింది. వారి పార్థివదేహాలను ఉదయం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వెల్లడించింది. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది..
_______________________.

ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తెలంగాణలోకి రాలేదు…మంత్రి హరీష్ రావు..

గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ను ఇవాళ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… MRI, cathalab సెంట‌ర్ల‌ను 45 రోజుల్లో ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తెలంగాణలోకి రాలేదన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల నుంచి వ‌చ్చిన అనుమానితుల‌కు 13 మందికి నెగటివ్ వ‌చ్చింద‌ని….రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు…ఇక తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతామ‌న్నారు. కరోనా సమయంలో ఇక్కడి డాక్టర్స్ అద్భుత సేవలు అందించార‌ని…
ప్రైవేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా గాంధీ లో సేవలు నిర్వ‌ర్తించార‌ని కొనియాడారు మంత్రి హ‌రీష్ రావు. క‌రోనా వ్యాక్సిన్ మొదటి డోస్ 95 శాతం జ‌రిగింద‌ని… రెండో డోస్ 51 శాతం పూర్తి అయింద‌న్నారు…
_________________&______

ఈ నెల నుంచే అంగన్‌వాడీల పెరిగిన వేతనాలు..
కేంద్రం ఇస్తున్నది 17 నుంచి 19 శాతమే : మంత్రి సత్యవతి రాథోఢ్‌*

అంగన్‌వాడీలకు జూలై నెల నుంచి పెంచిన వేతనాలను డిసెంబర్‌ జీతంతో కలిపి ఖాతాల్లో జమ చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో మంత్రి సమీక్ష చేశారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల వేతనాలను 2018 సెప్టెంబర్లో ఒకసారే పెంచిందని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ వారి వేతనాలను మూడు సార్లు పెంచారని చెప్పారు. 2021 సెప్టెంబర్‌ జీవో నెంబర్‌ 47 ద్వారా అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.10,500 నుంచి 13,650కు, అంగన్వాడీ హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.6 వేల నుంచి 7,800కి పెంచిందని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు అంగన్‌వాడీల వేతనాల్లో కేంద్రం, రాష్ట్ర వాటాలు గతంలో 90:10 శాతం చొప్పున ఉండేవన్నారు. మోడీ సర్కారు ప్రస్తుతం దాన్ని 60 శాతానికి తగ్గించిందని విమర్శించారు. అందులోనూ తిరకాసు పెట్టి దాన్ని 17 నుంచి 19 శాతమే ఇస్తున్నదని వివరించారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే వేతనాల్లో రాష్ట్రం వాటా 80 శాతం, హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉందని తెలిపారు. ప్రస్తుతం పెంచిన వేతనాల వల్ల 67,411 మంది అంగన్వాడీ ఉద్యోగులు లబ్ది పొందుతారన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, ఆ పార్టీ నేతల అసత్య ప్రచారాన్ని అంగన్‌వాడీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
——-___________.

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు త్వరలో ప్రారంభం..రైల్వే శాఖ మంత్రి అశ్విన్..

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌ రెడ్డి శుక్రవారం పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు…

——————-
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనంని వెనక నుండి ఢీ కొట్టిన డిసిఎం..

ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన డీసీఎం డ్రైవర్.

డీసీఎం క్యాబిన్ లోనే ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీస్తున్న పోలీసులు..
————

*యాదాద్రి జిల్లా గుండాల మండలం తాసిల్దార్ దయాకర్ రెడ్డి పై వేటు*

◆ మహిళా ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన కు ఉన్నత అధికారుల చర్యలు.