ముఖ్యాంశాలు…టాప్ న్యూస్..

R9TELUGUNEWS.COM. .

ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు(ఈసీ) భారీ షాక్

న్యూఢిల్లీ :

ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) భారీ షాక్ ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించింది..
***********************

ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయంది. వీటి ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.

********************

ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 326 పరుగుల భారీ తేడాతో ఘన విజయం..

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే క్వార్టర్స్‌ చేరిన భారత జట్టు పసికూన ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 326 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత కుర్రాళ్లు కనీవినీ ఎరుగని రీతిలో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేశారు. అనంతరం ఉగాండాను 19.4 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌట్‌ చేశారు.

********”-*************

రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంది. ఒమిక్రాన్‌ బయటపడిన అనంతరం నెలరోజులుగా ప్రతి ఇంట్లో ఇవి సర్వసాధారణమయ్యాయి. రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జ్వర సర్వేలో వెలుగుచూస్తున్న వాస్తవాలివి. 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం తదితర లక్షణాలున్న వారు 1,28,079మంది. వీరిలో 1,27,372 మందికి కిట్‌లు ఇచ్చారు. చాలా మందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోకుండా స్థానిక వైద్యుల సహకారంతో మందులు వాడుతున్నారు. జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లో కొవిడ్‌ లక్షణాల తీవ్రత తగ్గుతుండడంతో ప్రజలు తేలికగా తీసుకుంటున్నారు..

****************””***
చకచకా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వేస్టేషన్‌ విస్తరణ పనులు..

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వేస్టేషన్‌ విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. ఒకేసారి నాలుగు రైళ్లు నిలబడేలా పట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక జనరేటర్లు రప్పించారు. ఏడాదిగా పనులు నిలిచిపోవటంతో స్టేషన్‌ ఆవరణం దుమ్ముకొట్టుకుపోవటంతో అన్నింటినీ సరి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించి పనులు చేయిస్తున్నారు. గూడ్స్‌ రైళ్లను నడిపేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌- కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈమేరకు మనోహరాబాద్‌ నుంచి వర్గల్‌ మండలం నాచారం, రాయపోల్‌ మండలం అప్పాయిపల్లి మీదుగా గజ్వేల్‌ పట్టణం వరకు మూడు స్టేషన్ల నిర్మాణంతోపాటు 31 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మించారు. ఆరు చోట్ల ఫ్లైఓవర్లు, మరో మూడు చోట్ల అండర్‌ బ్రిడ్జీలు నిర్మించారు. 2020, జూన్‌ 18న రైల్వే భద్రతా కమిషన్‌ బృందం తనిఖీలు ముగిశాక అధికారులు కొబ్బరికాయ కొట్టి రైలు సేవలును లాంఛనంగా ప్రారంభించారు.

***********************.
భార్యను హత్య చేసిన భర్త..

నల్గొండ జిల్లా. మిర్యాలగూడలో భార్యను హత్యచేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ఓ భర్త..విభరల్లోకి వెళితే మిర్యాలగూడలో ని విద్యానగర్ లో నివాసం ఉంటున్న దంపతులు మిడ్తపల్లి స్రవంతి దీపక్ ల మధ్య గత కొంత కాలంగా ఆస్తి విషయంలో కుటుంభ తగాదాలు అవుతున్నాయి.. భర్తపై మహిళ పోలీస్ స్టేషన్ లో కేస్ కూడా పెట్టింది భార్య.. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరిమధ్య తగాదా అయి ఘర్షణ జరిగింది.. భర్త దీపక్ స్రవంతి ని గొంతు నులూమి హత్యచేసి, ఆపై పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.. కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు…
**********************
ప్రభుత్వ బడులకు ఆన్లైన్ క్లాసులు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 8, 9, 10 తరగతులకు ఆన్‌లైన్‌ బోధన నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. పాఠశాల సిబ్బంది రొటేషన్‌ పద్ధతిలో 50 శాతం మాత్రమే హాజరుకావాలని సూచించింది..

**”””””*************

వనమా రాఘవేంద్రకు రిమాండ్‌ పొడిగింపు

భద్రాద్రి
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు రిమాండ్‌ గడువును మరో 14 రోజులు పొడిగించారు.
ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు కోర్టులో వర్చువల్‌గా రాఘవను హాజరుపరిచారు. కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఆయనకు ఫిబ్రవరి 4 వరకు రిమాండ్‌ గడువు పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ప్రధాన సూత్రధారిగా వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
***********************
తెలంగాణలో కరోనా తాజాగా 4,393 మందికి పాజిటివ్‌..

హైదరాబాద్‌ :

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 1,16,224 నమూనాలను పరీక్షించగా 4,393 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,31,212కి చేరింది. ఇవాళ 2,319 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రికవరీ రేటు 95.18శాతంగా ఉన్నట్లు పేర్కొంది..