Top న్యూస్……… నేటి ముఖ్యాంశాలు..

ఈ నెల 26న భారత్ బంద్

రోజు రోజు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా లేటెస్టుగా ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి-26) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.
26న భారత్‌ బంద్‌ చేపట్టాలని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ పిలుపునిచ్చారు. దీనికి 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతిచ్చాయి. జీఎస్టీ విధానాన్ని సమీక్షించాలని, కొత్త ఈ-వే బిల్లు విధానంతో పాటు కొన్ని నిబంధనలను రద్దు చేయాలని ఆలిండియా ట్రాన్స్ పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  బంద్ కు మద్దతిచ్చింది. దీంతో పాటు దేశంలో డీజిల్ ధరలు కూడా ఒకేలా ఉండాలని తెలిపింది. భారత్ బంద్ కు అన్ని రాష్ట్ర స్థాయి ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్లు మద్దతు తెలిపాయి. ఈ భారత్‌ బంద్‌లో దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొననున్నారు.

*******************************************************************************************
న్యూ ఢిల్లీ:

నేడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఖరారు చేయడంపై కసరత్తు.మార్చి మొదటివారంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం.రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు తేదీలు ఖరారు.
******************************************************************************************
ఢిల్లీకి వెళ్లాలంటే కోవిడ్ నెగెటివ్ ఉండాల్సిందే.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఆయా రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. దేశంలోని మహారాష్ట్ర, కేరల, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులు కరోనా వైరస్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తామని ఢిల్లీ సర్కారు ప్రకటించింది…
*****************************************************************************
తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి : సీఎస్

హైదరాబాద్‌ : రాష్ట్రంలో 6 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు రేపటి నుంచి తరగతులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లు, డీఈఓలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. 6,7,8వ తరగతి విదార్థులకు తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పలు అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు.
రేపటి నుంచి మార్చి 1వ తేదీలోగా పాఠశాలల నిర్వాహకులు తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యా పర్యవేక్షక కమిటీలు సమావేశం కావాలని సూచించారు. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత కోసం అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
**********************************************************************************
మేడారం: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకునే వాతావరణం కల్పించారని చెప్పారు. వనదేవతలు కొలువైన మేడారంలో చిన్న జాతర నేడు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను మంత్రి దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా ముందుగా ములుగులోని గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేడారం జాతరకు టీఆర్‌ఎస్‌ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నదని, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మవార్లను దర్శించుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నదని చెప్పారు. భక్తులకు రవాణా, ఇతర వసతులు కల్పిస్తున్నదని తెలిపారు. చిన్న జాతర బుధవారం ప్రారంభమవుతుందని, ఈనెల 27వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారన్నారు.
******************************************************************************************
ఎస్సీ ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక అండ

ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్ లకు పబ్లిక్ వర్క్ లలో 21% శాతం రిజర్వేషన్

జీవో 59 ఇచ్చి ఆ వర్గాలకు అండగా నిలవడం దేశంలోనే మొదటిసారి

చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం

ఈ జీవో అమలుకోసం చొరవ తీసుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా ఎర్రోళ్ళ శ్రీనివాస్

సింగరేణి యాజమాన్యం తో నిర్వహించిన సమీక్షలో ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు 21%రిజర్వేషన్ కేటాయించాలని సూచించిన కమిషన్… చైర్మన్ డా ఎర్రోళ్ళ శ్రీనివాస్

రిజర్వేషన్లు అమలుకు జీవోను ఆమోదించిన సింగరేణి యాజమాన్యం..హర్షం వ్యక్తం చేసిన చైర్మన్ డా ఎర్రోళ్ళ శ్రీనివాస్

ఇక నుండి సింగరేణి కాంట్రాక్టు పనులలో ఎస్సీ ఎస్టీ వర్గాల యువ కాంట్రాక్టర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించిన చైర్మన్ డా ఎర్రోళ్ళ శ్రీనివాస్…
****************************************************************************************
కిడ్నాప్‌ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థి(19)ని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర‌ మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. కిడ్నాప్‌ నాటకం వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్‌కేసర్‌లోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్‌ఆర్సీకి చేరిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసు.

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. బుధవారం అరుణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ అమ్మాయి జీవించే హక్కు కోల్పోయేలా పోలీసులు ప్రవర్తించారని తప్పుబట్టారు. కిడ్నాప్‌ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కృంగిపోయిందని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని, విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని హెచ్‌ఆర్సీని అరుణ్‌కుమార్‌ కోరారు. రాచకొండ పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని ఆశ్రయించామని చెప్పారు. పోలీసుల తొందరపాటు చర్యల వల్ల విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. ముద్దాయిలు అని పోలీసులే చెప్పి… వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు కేసు విషయాలని చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయని, వాటిని చూసి భరించలేక షుగర్ టాబ్లెట్‌లు వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు ఇప్పుడు ఎవరు బాధ్యులని, ఇలా వ్యవహరించిన పోలీసులు చర్యలు తీసుకోవాలని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
కిడ్నాప్ డ్రామాతో నగరంలో సంచలనం సృష్టించిన ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని కేసు విషాదాంతమైంది. ఆ కేసులో తీవ్ర విమర్శల పాలైన సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్యం అందించి వైద్యులు ఇంటికి పంపారు. ఇంటికి వచ్చిన యువతి తిరిగి నిన్న రాత్రి మరోసారి షుగర్ ట్యాబ్లెట్లు మింగింది. ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈ కేసులో పోలీస్ శాఖను తప్పుదోవ పట్టించినందుకు గాను ఆమెకు శిక్ష పడే అవకాశముంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది…
*************************************************************************************************
లాక్ డౌన్ ఆలోచనల్లేవ్.. రాష్ట్రం సేఫ్—- మంత్రి ఈటల

ప్రస్తుతానికి లాక్ డౌన్  ఆలోచనలు లేవని..రాష్ట్రం సేఫ్ గా ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సరిహద్దు రాష్ట్రాలయిన మహారాష్ట్ర , కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కేసులు అత్యధికంగా ఉన్నాయన్నారు. సరిహద్దు దగ్గర కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టబోమన్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల దగ్గర జనం జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా విషయంలో అలసత్వం వద్దన్నారు.
టెస్టింగ్ కిట్స్  ధర చాలా తగ్గాయన్నారు. పగటి పుట వేడి, రాత్రి చల్లదనం ఉంటే.. వైరస్ వ్యాపి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారన్నారు. మరొక 15..20 రోజుల్లో ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది కాబట్టి.. వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ ను బయటి మార్కెట్ లో అందుబాటులో ఉండేలా కేంద్రం చూడాలన్నారు.  కరోనా విషయంలో నిరంతరం రీసెర్చ్ జరుగుతుండాలన్నారు. హార్డ్ ఇమ్యూనిటీ వచ్చింది.. అలాగే వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి కరోనా మరింత తగ్గొచ్చన్నారు.
**************************************************************************************
టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న ఓ హిందీ సినిమా సెట్ పై రాళ్ల దాడి జరిగింది. హిందీ స్టార్ హీరో జాన్ అబ్రహామ్‌తో అటాక్ అనే సినిమాలో రకుల్ యాక్ట్ చేస్తోంది. అందులో భాగంగా డమ్మీ బాంబ్‌ బ్లాస్టింగ్‌ జరిపారు. షూటింగ్‌‌కు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే మూవీ షూట్ గురించి తెలుసుకున్న గ్రామస్తులు సెట్ వద్దకు చేరుకొని నటీనటులను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో సీరియస్ అయ్యిన గ్రామస్తులు ఎదురుదాడికి దిగారు. గార్డుల మీదకు రాళ్లు విసిరారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. హీరోహీరోయిన్లకు ఎలాంటి ఇంజ్యురీస్ అవ్వలేదు….
*******************************************************************************
కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ.. మూడో టెస్టు ఆరంభంలోనే టీమిండియాకి శుభారంభమిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో అతను వేసిన బంతిని వెంటాడిన ఇంగ్లాండ్ ఓపెనర్…
టీం ఇండియా జోరు ఏ మాత్రం తగ్గలేదు. పింక్ బాల్ టెస్ట్ లో టీం ఇండియా బౌలర్లు చెలరేగిపోయారు. మొతెర స్టేడియం వేదికగా జరుగుతున్న డే\నైట్‌ టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ల ధాటికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్‌ జాక్‌ క్రాలే 53 పరుగులతో రాణించినా.. డొమినిక్‌ సిబ్లే , జానీ బెయిర్‌ స్టోలు డకౌట్‌ కాగా.. కెప్టన్‌ జోరూట్‌ 17, బెన్‌ స్టోక్స్‌ 6, ఒలీ పోప్‌ 1, జాక్‌ లీచ్‌ 3, అర్చర్‌ 11, బెన్‌ ఫోక్స్‌ 12, బ్రాడ్‌ 3 పరుగులే చేసి ఘోరంగా ఫెయిలయ్యారు. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 48.4 ఓవర్లలో 112 పరుగులకే చాప చుట్టేసింది. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ ఆరు వికెట్లు తీయగా.. ఇశాంత్‌ శర్మ ఒక వికెట్‌, అశ్విన్‌ మూడు వికెట్లు తీశారు.