తొర్రూర్ నుండి ఉప్పల్ కు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు బోల్తాపడడంతో ఇద్దరు మృతి…!

తొర్రూరు టౌన్,

తొర్రూర్ నుండి ఉప్పల్ కు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు బోల్తాపడడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది.

ఏపీ 36జెడ్ 0197 బస్సు తొర్రూర్ నుండి ఉదయం సుమారు 10గంటల 30 తర్వాత బయలుదేరి ఉప్పల్ కు వెళ్తుండగా పాటిమట్ల ఎక్స్ రోడ్డు సమీపంలో బొడ్డుగూడెం వద్ద బస్సుకు ఉన్న కట్టర్లు దెబ్బతిని పల్టీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు ప్రమాదానికి గురై మృతి చెందారని విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.