భాజపా, తెరాస డ్రామా ఆడుతున్నాయి.. టిపిసిసి రేవంత్ రెడ్డి..

కొంపల్లిలో నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. సంజయ్‌పై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు భాజపా ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. భాజపా, తెరాస డ్రామా ఆడుతున్నాయని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై చర్చ జరగకుండా ఉండేందుకు ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయని ఆరోపించారు…కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాలి. విద్యుత్‌ ప్రాజెక్టుల్లోనే కేసీఆర్‌ రూ.వెయ్యికోట్ల అవినీతి చేశారు…కేసీఆర్‌ అవినీతిని నేను నిరూపిస్తా. అలా నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని రేవంత్‌ అన్నారు…కాంగ్రెస్ పార్టీ చర్చలో లేకుండా ఉండేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పొలిటికల్‌ డ్రామాలు ఆడుతున్నాయన్నారు…