ప్రజలపై మోయలేని భారం మోపితే చూస్తూ ఊరుకోము…టీపిసీసీ రేవంత్ రెడ్డి…

ప్రజలపై మోయలేని భారం మోపితే చూస్తూ ఊరుకోము… TPCC రేవంత్ రెడ్డి..

విద్యుత్ పంపిణీ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలను చర్చకు తావు లేకుండా ఈఆర్సీ తిరస్కరించాలన్నారు. ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో తెలంగాణలోని డిస్కంలు అప్పులపాలు అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వినియోగదారు అనే విషయాన్ని మర్చిపోతున్నారని..ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు చెల్లించాలన్నారు. ఏటా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం 16 వేల కోట్లు చెల్లించాలి. కానీ ఏటా 10 వేల కోట్లను ఎగవేస్తూ..కేవలం 6 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తోందన్నారు. దీంతో డిస్కంల అప్పులు 60 వేల కోట్లకు చేరాయని తెలిపారు. డిస్కంల ప్రధాన డిఫాల్టర్ రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. బిల్లులు చెల్లించని వినియోగదారులపై చర్యలు తీసుకున్నట్లే ప్రభుత్వంపైనా చర్యలు తీసుకోవాలన్నారు.విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తక్కువ ధరకే కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ సకాలంలో చెల్లిస్తే పెంపు అవసరం ఉండదన్నారు. విద్యుత్ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణమని విమర్శించారు.