తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్ వలనే..టిపిసీసీ రేవంత్ రెడ్డి..

ధాన్యం కొనుగోళ్లలో కృత్రిమ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. జాతీయ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన గరువారం జరిగిన పార్టీ కిసాన్‌ కాంగ్రెస్‌ సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన రాహిత్యం వల్ల రాష్ట్రంలో వరి కొనుగోళ్లలో గందరగోళం ఏర్పడిందని, ఫలితంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ మొండివైఖరిని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చుట్టూ బిహారీ అధికారులే ఉన్నారని రేవంత్‌రెడ్డి అన్నారు..ఐఏఏఎ్‌సలు, ఐపీఎ్‌సల పోస్టింగ్‌లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖపై మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు కుమారుడు విజేతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ తెలిపారు.