కేసీఆర్ కు సవాల్ చేస్తున్న వనపర్తి లో కేసీఆర్ సభకు వచ్చిన జనం ఎక్కువనా… కొల్లాపూర్ లో కాంగ్రెస్ సభ ఎక్కువనా తేల్చుకో..టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి…

కొల్లాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు- మన పోరు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
కేసీఆర్ కు సవాల్ చేస్తున్న వనపర్తి లో కేసీఆర్ సభకు వచ్చిన జనం ఎక్కువనా… కొల్లాపూర్ లో కాంగ్రెస్ సభ ఎక్కువనా తేల్చుకో..

కాంగ్రెస్ సభకు బయట పల్లకాయ లు అమ్మకున్నంత మంది కూడా వనపర్తి కేసీఆర్ సభకు రాలేదు

కొల్లాపూర్ పట్టణమంతా కాంగ్రెస్ మాయం అయ్యయింది..
కొల్లాపూర్ రాజవారి వీధిలో కూరగాయాలు అమ్ముకుంటున్న ఆడవాళ్లు, మహిళా హోమ్ గార్డ్ లో కళ్ళల్లో ఆనందంతో నాకు స్వాగతం పలుకుతుంటే కాంగ్రెస్ గెలుపు ఖాయం అయ్యింది.

మీ నల్లమల బిడ్డగా 119 నియోజకవర్గాలు తిరుగుతా, 33 జిల్లాలు తిరుగుతా..

శ్రీశైలం ముంపు ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు

8 ఏళ్ళు అయ్యింది.. ఇక్కడ బాధితులకు న్యాయం జరగలేదు.

నల్లికిట్లోడు పార్టీ ఫిరాయించినోడు అన్నాడు 98 జి.ఓ అమలు చేయిస్తా అన్నాడు..

కుడికిల్ల దళితులకు భూములకు పరిహారం ఇప్పిస్తా అన్నావు.

ఓ సన్నాసి నీకు జ్ఞానోదయం అయ్యిందా..

ఈ సన్నాసి గెలుపు కోసం అప్పట్లో నేను కష్టపడ్డా

ఈ సారి కొల్లాపూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..ఇక్కడ మాదాసి కురువలను ఎస్సీ లలో చేరుస్తా అన్నారు.

వాల్మీకి బోయలు ఎస్టీ లలో చేరుస్తా అన్నాడు.

వాల్మీకి బోయలకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు..

గట్టు భీముడుకు ఎమ్మెల్సీ ఇస్తా అని హామీ ఇచ్చిండు ఇవ్వలేదు.

ముదిరాజ్ లకు న్యాయం చెయ్యలేదు.. టిఆర్ఎస్ లో ఉన్న ఒక్క ముదిరాజ్ ను బొంద పెట్టిండు..

ఎస్సీ వర్గీకరణకు ఢిల్లీ లో మోడీ దగ్గర పంచాయతీ పెడ్త అన్నాడు..

మిమ్మల్ని మోసం చేసిన కేసీఆర్ కు మాదిగలు గూటం దెబ్బ కొట్టాలి.

మేము మాదిగల వర్గీకరణ కోసం అసెంబ్లీ లో పోరాటం చేస్తే నన్ను, సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్ లను అసెంబ్లీ నుంచి బహిష్కరణ చేశారు.

ఎస్సీ వర్గీకరణ జరగాలంటే పాలమూరు లో 14 సీట్లు కాంగ్రెసును గెలిపోయించాలి.

సోనియమ్మ ను గెలిపిస్తే సోనియమ్మ మిమ్మల్ని గెలిపిస్తది..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాదాసు కురువలను ఎస్సి లలో చేర్చుతాం..

వాల్మీకి బోయలకు ఎస్టీ లలో చేర్చుతాం. ఎస్సీ వర్గీకరణ చేయించి తీరుతం.కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపింది.వంద సమస్యలకు ఒకటే పరిష్కారం.ఆ పరిష్కారమే సోనియమ్మ, కాంగ్రెస్ అధికారంలోకి రావడమే పరిష్కారం.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం…

4గురు మహిళల కు మంత్రి పదవులు ఇస్తాం..పాలమూరు జిల్లాలోని 20 లక్షల ఎకరాలకు నీరు అందించే వరకు నిద్రపోము..

కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, జూరాల, ఎస్ఎల్బీసి పనులన్నీ పూర్తి చేస్తాం..

ఇక్కడ ఉన్న నాయకుడికి నీళ్ల నిరంజన్ అంతరంట.. నీళ్లు ఇవ్వలేదు, కరవుతో కటకటాలలాడుతుంది.

పాలమూరు జిల్లాలో బూర్గుల రామేశ్వర రావ్, మల్లు అనంత రాములు, జైపాల్ రెడ్డి లాంటి మహానుభావులు పుట్టిన నెల ఇది..

శ్రీనివాస్ గౌడ్ చంపడానికి సుపరి ఇచ్చాడు అంటున్నారు. నిన్ను రోడ్ మీద పోతుంటే కుక్క కూడా కరవదు.. నిన్ను చంపడానికి 15 కోట్లు ఇస్తారా…ఒకవేళ 15 కోట్లు ఇచ్చి నిన్ను చంపాలనుకుంటే నువ్ ఎంత దుర్మార్గం చేసావు..ఇసుక, మట్టి అన్ని అమ్ముకుంటున్నావు..
ఒక్క అవకాశం ఇవ్వండి.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఒక ఓటు ఇవ్వండి.. సోనియమ్మ ను గెలిపించండి..