సినిమా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాతనే కేటీఆర్, సినిమా వాళ్ళు దగ్గరయ్యారు…. సంచలన వ్యాఖ్యలు చేసినా TPCC రేవంత్ రెడ్డి..

న్యూఢిల్లీ

*డ్రగ్స్ వ్యవహారం పై స్పందించిన రేవంత్ రెడ్డి*

నా కుటుంబ సభ్యులను తప్పించాలని కోరాను.

డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి పట్టుకున్న వారి సాంపిల్స్ ఎందుకు సేకరించలేదు
నా కుంటుంబీకులు ఎవరున్నా సరే ..నా పిల్లల రక్త నమూనాలు వెంట్రుకలు అందరికి పరీక్షలు చెపిస్తా… సమాజంలో ప్రజలను కాపాడాల్సిన నైతిక బాధ్యత నాపై ఉంది.. నేను నా బందువుల నమూనాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా…142 మందిని అదుపులోకి తీసుకుని సంపిల్స్ తీసుకోలేదంటే మీరు ఎవరినో తప్పించడానికి చూస్తున్నారు…పిల్లలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.. నా మేనల్లడిని డ్రగ్స్ తీసుకున్నాడా లేదో తెలుసుకునేందుకు సాంపిల్స్ కోసం పంపిస్తా…కేసీఆర్ కేటీఆర్ ను పంపిస్తావా.. అన్ని విచారణలకు సిద్ధంగా ఉన్నా..చదువుకునే పిల్లలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు..డ్రగ్స్ వ్యవహారం పై నిష్పక్షపాత విచారణ కోరుతున్నా.సీబీఐ ఈడి తో సిట్ ఏర్పాటు చేయాలి
గతంలో రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం పై కోర్టును సైతం ఆశ్రయించా..
కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాసా..డ్రగ్స్ వ్యవహారం పై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని పోరాడింది నేనే.. ఈడీకి పూర్తి సమాచారం బదిలీ చేయాలనీ ఆదేశాలు వచ్చినా అది జరగలేదు

డ్రగ్స్ అడ్డుపెట్టుకుని సినిమా రంగం పై కేటీఆర్ పట్టు సాధించారు..డ్రగ్స్ కేసు అడ్డుపెట్టుకుని సినీరంగం నుంచి అవసరాలు తీర్చుకోవాలని చూస్తున్నారు.. 24 గంటల మద్యం అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే. రాష్ట్రంలో జరుగుతున్న మాదకద్రవ్య వ్యాపారాలపై 2017లోనే హైకోర్టులో పిటిషన్ వేశాను… రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా పై స్వచ్ఛంద సంస్థలతో ఎంక్వైరీ చూపించాలని కోరాను…2017 లో సినిమా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాతనే కేటీఆర్, సినిమా వాళ్ళు దగ్గరయ్యారు..2017 కు ముందు కేటీఆర్ కి సినిమా వాళ్ళు ఎవరు పరిచయం లేదు

ఈ కేసును అడ్డం పెట్టుకుని కేటీఆర్ సినిమా వాళ్లతో సన్నిహితంగా ఉంటున్నాడు…రాష్ట్రంలో 24 గంటలు మద్యం, పబ్బులు నడుపుకోమని పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.. పబ్ లో దొరికిన వారిపై ఎందుకు వైద్య పరీక్షలు నిర్వహించి లేదు.. ఈ అంశంపై త్వరలో కోర్టు కి వెళ్తాను… గతంలోనే డ్రగ్స్ కేసులో దొరికిన వారి మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ వీడియో క్లిప్స్ సీజ్ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది… నా బంధువుల పేర్లు ఎవరైతే పేర్లు బయటికి వచ్చాయో వారి నమూనాలను ఇప్పిస్తాని..
అసలు డ్రగ్స్ తీసుకున్న వారిని వదిలి పెట్టి , మా పిల్లల పై ఆరోపణలు చేయడం ఏంటి.. చిన్నపిల్లల అడ్డం పెట్టుకుని నాపై రాజకీయం చేయడం ఏంటి… శిఖండి రాజకీయాలు చేయకండి.. కెసిఆర్ నీకు దమ్ముందా నీ కొడుకు నమూనాలు ఇప్పిస్తావా…
డ్రగ్స్ హబ్ గా రాష్ట్రాన్ని మార్చేసే కుట్ర కేసీఆర్ కుటుంబం పూనుకుంది..