మోడీకి పోయే కాలం వచ్చింది…ఆర్మీ జోలికి వెళ్తున్నారు… టిపిసిసి రేవంత్ రెడ్డి..

అగ్నిపథ్ పై ఏఐసీసీ పిలుపు మేరకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ అధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు.

మోడీకి పోయే కాలం వచ్చింది కాబట్టే ఆర్మీ జోలికి వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. అదానీ, అంబానీల కోసమే అగ్నిపథ్ తీసుకొచ్చినట్లుగా ఉందన్నారు. జవానుగా 4 ఏళ్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. అగ్నివీరులు నాలుగేళ్లకే మళ్లీ నిరుద్యోగి అవుతారన్నారు. పోలీసులకే 9 నెలల ట్రైనింగ్ ఇస్తుంటే.. జవాన్లకు 6 నెలల శిక్షణ ఎలా సరిపోతుందని రేవంత్ ప్రశ్నించారు. ఆరు నెలల శిక్షణతో శత్రు దేశాలను ఎలా ఎదుర్కొంటారని నిలదీశారు. ఇజ్రాయిల్ విధానం ఫాలో అవుతున్నామని చెప్పడం సిగ్గు చేటన్నారు రేవంత్ రెడ్డి. కోటి జనాభా లేని దేశంతో భారత్ ను పోల్చడం దారుణమని మండిపడ్డారు. ఇజ్రాయిల్ దేశ జనాభా గ్రేటర్ హైదరాబాద్ జనాభా కంటే తక్కువ అన్నారు. ఇజ్రాయిల్ లో నిరుద్యోగ సమస్యలేదని.. . దేశాన్ని కాపాడాలనుకున్న పిల్లలపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం సరికాదన్నారు. స్పెషల్ కోర్టు ద్వారా అసలు దోషులను శిక్షించి అమాయకులను వదిలేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు….రెండేళ్ల క్రితం ఫిజికల్ టెస్ట్ పాసైన అభ్యర్థులకు రాత పరీక్ష పెట్టకుండా రద్దుచేయడం వల్లే సికింద్రాబాద్ ఘటన జరిగిందన్నారు. రాకేష్ శవయాత్రను టీఆరెస్ నేతలు రాజకీయ యాత్రగా మార్చారని విమర్శించారు. మన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. నిరుపేద పిల్లలే ఆర్మీ వైపు వస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాకేష్ శవయాత్రను టీఆరెస్ నేతలు రాజకీయ యాత్రగా మార్చారని విమర్శించారు..