తేలు మంత్రం తెలియనోడు పాము నోట్లో వేలుపెట్టినట్లు. రాజగోపాల్ రెడ్డి తీరు.. టిపిసిసి రేవంత్ రెడ్డి…

నల్గొండ జిల్లా మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ..

(దేవులమ్మ నాగారం)

రాష్ట్రంలో బీజేపీ ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు..

ఆడవాళ్లకు టికెట్ ఇస్తే అరిష్టం అనుకునే పార్టీలు టీఆరెస్, బీజేపీ లు.

నలుగురు మహిళలకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది.

రాష్ట్రంలో అయిదుగురు మహిళలను మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది..

ఈ ఉప ఎన్నికలు మునుగొడుకు ఏమైనా నిధులు వచ్చాయా?…

అమ్ముడు పోయినోళ్ళకు మాత్రమే నిధులు వచ్చినయ్..

ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని పైసలతో టీఆరెస్, బీజేపీ కొనాలని చూస్తున్నాయి.

తేలు మంత్రం తెలియనోడు పాము నోట్లో వేలుపెట్టినట్లు…

కాంగ్రెస్ ను మోసం చేసి పోయినోడు రాజకీయంగా చావడం ఖాయం.

మునుగోడులో మీ ఆడబిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

సీఎం చొక్కా పట్టి మరీ మునుగోడు సమస్యలపై కొట్లాడుతుంది..

రాష్ట్రమంతా మునుగోడు వైపు చూస్తోంది

మీ తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని నమ్ముతున్నాం..