*రేవంత్ రెడ్డి చిట్ చాట్..*
విజయభేరీ సభ చూసి కేసీఆర్ కు చలి జ్వరం వచ్చింది.
ప్రగతి భవన్ ను కాలీచేయాల్సివస్తుందో అన్న భయం కేసీఆర్ లో మొదలయింది.
9 ఏళ్ళలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు..
కేసీఆర్ అచ్చి నెంబర్ కోసం 6 లక్షల కోట్ల అప్పు చేసారు.
మా నాయకుడు కేసీఆర్, కేటీఆర్ లా బ్లఫ్ మాస్టర్ కాదు.. రాహుల్ గాంధీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడుతాడు..
ఎంఐఎం, బీఆర్ఎస్ లేని చోట బీజేపీ కి ఓటు వేయాలని అసదుద్దీన్ చెప్తున్నారు.
కేసీఆర్ పై నమ్మకం లేకనే కవిత కోర్ట్ కు వెల్లింది.
కవిత అరెస్ట్ కోర్ట్ జోక్యం వల్ల ఆగిపోయింది.
పార్టీ లో చేరడానికి అందరికీ ఆహ్వానమే.. టిక్కెట్ స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది.
బీసీ లకు 34 సీట్లు ఇవ్వాలని 100శాతం ప్రయత్నిస్తున్నాం.. బీఆర్ఎస్ కంటే బీసీ లకు ఎక్కువ సీట్లు ఇస్తాం.
అన్ని సమాజికవర్గాల వారు మా పార్టీ లో బలమైన వాదన వినిపించారు..వారి తరుపున సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లో నా వాదన ఉంటుంది.
కాంగ్రెస్ లో ఎంతో మంది బీసీ లు పార్టీ కి పీసీసీ ఛీఫ్ గా చేసారు… ఒక్కరైనా బీఆర్ఎస్ కు బీసీ అధ్యక్షుడు అయ్యాడా.
కాంగ్రెస్ లో విడతల వారిగా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది.
సీఈసీ మీటింగ్ పెట్టాలని ఏఐసీసీ ని కోరాం..సీఈసీ మీటింగ్ తర్వాత ఫస్ట్ లీస్ట్ విడుదల అవుతుంది.
కేటీఆర్ అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నాడు..
తెలంగాణ ఉధ్యమ సమయంలో వైట్ హౌస్ ముందు ధర్నా చేసాం..నిరసన ఓక్కో సమయంలో ఓక్కోలా చేస్తాం.
నిరసన లు చేసే హక్కు అందరికీ ఉంటుంది.
బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ లో ఎందుకు ధర్నా చేస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలు తీసుకుంటుంన్న 30% కమీషన్ కంట్రోల్ చేస్తే..కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సమర్దవంతంగా అమలు చేయవచ్చు.
రేపు సాయంత్రం మైనంపల్లి కాంగ్రెస్ లో చేరుతారు..
మైనంపల్లి ఫ్యామిలీ కి రెండు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది.
వేముల వీరేశం చేరిక తొందరలోనే ఉంటుంది.
చట్టం పై కేటీఆర్ కు అవగాహన ఉందా, ఎమ్మెల్సీల ఎంపిక చాలా కేటగిరీ లలో జరుగుతుంది.
కేటగిరీ ని బట్టి ఎంపిక విధానం ఉంటుంది..
గవర్నర్ ఎంపిక కు , ఎమ్మెల్సీ ల ఎంపిక కు సంబంధం లేదు..
త్వరలోనే పార్టీ బస్సు యాత్ర ఉంటుంది..
మా సర్వే లలో బీఆర్ఎస్ 25 సీట్లు దాటదు , బీజేపీ, ఎంఐఎం లు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతాయి..