కాంగ్రెస్‌ టికెట్‌ 25 కోట్లకు టిపిసిసి రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారు…టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి.

కాంగ్రెస్‌ టికెట్‌ 25 కోట్లకు తాకట్టు

అమ్ముకొన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి విమర్శ

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కుమ్మ క్కు కావడం వల్లే బీజేపీ గెలిచిందని టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ను రూ.25 కోట్లకు లోపాయికారిగా బీజేపీకి అమ్ముకొన్నారని ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లెక్కింపు కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న హయాంలో గత హుజూరాబాద్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి 62 వేలకు పైగా ఓట్లు సాధించారని, ప్రస్తుత పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసుకొన్న చీకటి ఒప్పందంతో కాంగ్రెస్‌ అభ్యర్థి 3 వేల ఓట్లను మాత్రమే సాధించారన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ 84 వేల ఓట్లు సాధించారని, ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.